
రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, ఎల్లుండి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది.