
బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కోల్ కతాలోని నియోతియా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం రాత్రి ఆమె అక్కడ అడ్మిట్ అయ్యారు. బెంగాలీ నటుడు యష్ దాస్ గుప్తా ఆమెను హాస్పటల్ కు తీసుకెళ్లాడు. నిఖిల్ జైన్ తో రెండేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న నుస్రత్ 2019, జూలై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో నిఖిల్ తో తన పెళ్లి ఇండియన్ చట్టాల ప్రకారం చెల్లదని నుస్రత్ ప్రకటించడం సంచలనం సృష్టించింది.