https://oktelugu.com/

Maharashtra Political Crisis: శివసేనలో చీలిక.. సంక్షోభంలో ‘మహా’ సర్కార్‌..

Maharashtra Political Crisis: రాష్ట్రపతి ఎన్నికల వేళ.. మరాఠాలో సర్కార్‌లో సంక్షోభం విపక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈమేరకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో అధికార శివసేనతోపాటు, మద్దతుగా ఉన్న కాంగ్రెస్, ఎన్‌సీపీలో టెన్షన్‌ నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే పార్టీ శివసేనను చీల్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు 10 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానంపై ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 21, 2022 1:46 pm
    Follow us on

    Maharashtra Political Crisis: రాష్ట్రపతి ఎన్నికల వేళ.. మరాఠాలో సర్కార్‌లో సంక్షోభం విపక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈమేరకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో అధికార శివసేనతోపాటు, మద్దతుగా ఉన్న కాంగ్రెస్, ఎన్‌సీపీలో టెన్షన్‌ నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే పార్టీ శివసేనను చీల్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు 10 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానంపై ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు షిండే. ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన ఫోన్‌ కూడా కలవట్లేదు. దీంతో సంక్షోభం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహిస్తానని ప్రకటించి మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడి సర్కార్‌లో అలజడి చేపారు. ఈ మీడియా సమావేశంలో ఆయన ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన చేసే ప్రకటనపైనే మహా సర్కార్‌ మనుగడ ఆధారపడి ఉంది. దాదాపు ఆయన సర్కార్‌కు షాక్‌ ఇస్తారన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏక్‌నాథ్‌ షిండే మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.

    Maharashtra Political Crisis

    Eknath Shinde, Uddhav Thackeray

    పొత్తుల సంసారంలో చిక్కులు..
    మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్నది శివసేన, కాం్రVð స్, ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ–శివసేన కలిసి పోటీ చేశాయి. ఎన్నికత తర్వాత బీజేపీ సీట్లు కాస్త తగ్గడంతో శివసేన హ్యాండ్‌ ఇంచ్చి.. కాంగ్రెస్‌కు స్నేహ హస్తం ఇచ్చింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శివసేనకు ఉండడంతో కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాష్ట్రంలో సర్కార్‌ ఎçప్పుడైనా కుప్ప కూలొచ్చని ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆయన మాటలను అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఫడ్నవీస్‌ జోష్యమే నిజమయ్యేలా కనిపిస్తోంది.

    Also Read: Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా… నో చెప్పిన గోపాలకృష్ణ గాంధీ

    Maharashtra Political Crisis

    Minister Eknath Shinde

    ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో కూటమికి ఝలక్‌..
    మహారాష్ట్రలో ఇటీవల ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార మహావికాస్‌ అఘాడీ 3, ప్రతిపక్ష బీజేపీ 2 స్థానాలు గెలిచే బలం ఉంది. అయితే బీజేపీ మూడో స్థానానికి కూడా స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలిపింది. ఇక్కడి నుంచి సంక్షోభం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి బలం లేకున్నా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించి అధికార కూటమికి ఝలక్‌ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కలకలం చెలరేగింది. దీంతో శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరాఠాలో ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో స్పష్టత రానుంది.

    Also Read: Political Crisis in Maharashtra: మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను కూల్చే పనిలో బీజేపీ

    Tags