https://oktelugu.com/

Major Closing Collections: మేజర్ క్లోసింగ్ కలెక్షన్స్

Major Closing Collections: అడవి శేష్ హీరో గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన చిత్రం మేజర్ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ స్టేటస్ ని అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..26 /11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా పై విడుదలకు ముందు నుండే భారీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 21, 2022 / 02:00 PM IST

    Major Closing Collections

    Follow us on

    Major Closing Collections: అడవి శేష్ హీరో గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన చిత్రం మేజర్ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ స్టేటస్ ని అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..26 /11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా పై విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాడు ఆ చిత్ర దర్శకుడు శశి కుమార్..కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అనే వైబ్ తీసుకొని రావడం లో ఈ మూవీ యూనిట్ సక్సెస్ సాధించింది..దానికి తగ్గట్టు గానే ఈ మూవీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ఇక లాంగ్ రన్ లో కూడా కమల్ హాసన్ విక్రమ్ సినిమా మానియా ని తట్టుకొని అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు క్లోసింగ్ కి వచ్చేసింది..ఈ మూవీ ప్రాంతాలవారీగా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

    Major Closing Collections

    Also Read: Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా… నో చెప్పిన గోపాలకృష్ణ గాంధీ

    ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 15 కోట్ల రూపాయిల బిజినెస్ వరుకు జరగగా, కేవలం మొదటి రోజే 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది..అంటే దాదాపుగా 50 శాతానికి పైగా రికవరీ మొదటి రోజే జరిగిపోయింది అన్నమాట..బయ్యర్స్ కి ఈ సినిమా నిజంగా ఒక జాక్పాట్ లాంటిది అనే చెప్పాలి..ఆలా స్టడీ కలెక్షన్స్ తో అద్భుతమైన వీకెండ్ తో ప్రారంభం అయినా ఈ సినిమా, పని దినాలలో కూడా పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టింది..మొదటి వారం లో దాదాపుగా 26 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది..నైజాం ప్రాంతం లో దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం ,సీడెడ్ ప్రాంతం లో 2.50 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 2.80 లక్షలు..ఉభయ గొడవారి జిల్లాలు రెండు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..ఇక కృష్ణ , గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలు అన్ని కలిపి 3 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక నార్త్ ఇండియా, ఓవర్సీస్ , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపుగా 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా..హీరో గా అడవి శేష్ కి ఈ సినిమా కమర్షియల్ గా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా నిర్మాత మహేష్ బాబు కి కూడా కాసుల కనకవర్షం కురిపించింది.

    Major Collections

    Also Read: CBI Counter Petition On Jagan: జగన్ టూర్ కు అనుమతి వద్దు.. ప్రత్యేక కోర్టులో సీబీఐ కౌంటర్

    Tags