ఎదురు చూసినా పదవీయని జగన్?

పదవుల కోసం పాకులాడడం నాయకులకు అలవాటే. అధికార పార్టీ అండతో ఏదో ఒక పదవి సాధించుకోవడానికి తపన పడుతుంటారు. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేస్తారు. ప్రతిపక్షాన్నిఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతూ వారిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఏదో విధంగా నామినేటెడ్ పదవి అయినా దొరికే వరకు విధేయుడిగా ప్రవర్తిస్తుంటారు. దీంతో అధికార పార్టీ దగ్గర మార్కలు కొట్టేస్తుంటారు. చివరికి ఏదో ఒక పదవి సాధించుకుంటారు. జూపూడి ప్రభాకర్. వైసీపీలో నాయకుడు. కొన్నాళ్లుగా కనిపించకుండా పోయి హఠాత్తుగా […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 4:16 pm
Follow us on

పదవుల కోసం పాకులాడడం నాయకులకు అలవాటే. అధికార పార్టీ అండతో ఏదో ఒక పదవి సాధించుకోవడానికి తపన పడుతుంటారు. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేస్తారు. ప్రతిపక్షాన్నిఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతూ వారిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఏదో విధంగా నామినేటెడ్ పదవి అయినా దొరికే వరకు విధేయుడిగా ప్రవర్తిస్తుంటారు. దీంతో అధికార పార్టీ దగ్గర మార్కలు కొట్టేస్తుంటారు. చివరికి ఏదో ఒక పదవి సాధించుకుంటారు.

జూపూడి ప్రభాకర్. వైసీపీలో నాయకుడు. కొన్నాళ్లుగా కనిపించకుండా పోయి హఠాత్తుగా ప్రత్యక్షమై బాబు కుటుంబంపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. జగన్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ప్రభుత్వం ఉన్నదే పప్పుబెల్లాల మాదిరిగా పంపకాలు చేయడానికేనని భాష్యం చెప్పారు. జగన్ ను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని పేర్కొన్నారు. టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

నిలకడ లేని రాజకీయాలు చేయడంలో ముందుండే జూపూడి గతంలో ఎస్సీవర్గీకరణకు వ్యతిరేకంగా గళం విప్పారు. వైసీపీ తరఫున కొండపి నుంచి పోటీ చేయడం అక్కడ చిత్తుగా ఓడిపోయిన తర్వాత మళ్లీ చంద్రబాబు చెంతకు చేరడం, ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని దక్కించుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రయత్నం పడిపోవడంతో మళ్లీ జగన్ చెంతకు చేరారు.