
మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్ రీమేక్’ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు, అలాగే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారు. గత నాలుగు నెలలు నుండి ఆ మార్పుల ప్రవాహంలో ఈ సినిమా యూనిట్ కొట్టుమిట్టాడుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో మరో మెగా హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మలయాళ వెర్షన్ లో ‘టోవినో థామస్’ నటించిన పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. విదేశాల నుండి ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే పాత్ర కావడం, పైగా చిరుకి సపోర్టర్ రోల్ కావడంతో ఈ పాత్రకు వరుణ్ తేజ్ అయితే బాగుంటాడని చిరు కూడా ఫీల్ అవుతున్నారట. వరుణ్ తేజ్ నటిస్తే ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
ఎలాగూ మెగా కుర్ర హీరోలు మెగాస్టార్ తో కలిసి నటించాలని ఆశ పడుతూ ఉంటారు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. గతంలోనే మెగాస్టార్ పక్కన నటించడం తన కల అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి లూసిఫర్ తో తన కల నెరవేరబోతోంది. ప్రస్తుతం ‘వరుణ్ తేజ్’ సోలో సినిమాల విషయానికి వస్తే.. ‘గని’, ‘ఎఫ్ 3’ సినిమాలతో పాటు మరో కొత్త సినిమాకి కూడా కమిట్ అయ్యాడు.
ఇక లూసిఫర్ సినిమాకి మోహన్ రాజాను దర్శకుడిగా ఫిక్స్ చేసిన తరువాత, స్క్రిప్ట్ లో చాల మార్పులు చేసాడు. తానూ చేసిన ఆ మార్పులు చిరుకి కూడా బాగా నచ్చాయి. కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత, ఈ సినిమా షూట్ మొదలుకానుంది. అలాగే మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో బాలీవుడ్ నటి ‘విద్యా బాలన్’ నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.