https://oktelugu.com/

2024 ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ అగ్రనటుడు. అలాగే రాజకీయ నాయకుడు కూడా.. టీడీపీ తరపున హిందూపూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వేవ్ ను తట్టుకొని నిలబడి మరీ హిందూపూర్లో తన సీటును గెలుచుకున్నారు. టిడిపి పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కూడా బాలక్రిష్ణ కొనసాగుతున్నారు. ప్రస్తుతం అతను సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజకీయ నాయకుడిగా పెద్దగా బయట కనిపించడం లేదు. ఇప్పటికే ఆయన సీరియస్ లేని రాజకీయ నాయకుడిగా విమర్శలు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 4, 2021 / 03:59 PM IST
    Follow us on

    నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ అగ్రనటుడు. అలాగే రాజకీయ నాయకుడు కూడా.. టీడీపీ తరపున హిందూపూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వేవ్ ను తట్టుకొని నిలబడి మరీ హిందూపూర్లో తన సీటును గెలుచుకున్నారు.

    టిడిపి పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కూడా బాలక్రిష్ణ కొనసాగుతున్నారు. ప్రస్తుతం అతను సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజకీయ నాయకుడిగా పెద్దగా బయట కనిపించడం లేదు. ఇప్పటికే ఆయన సీరియస్ లేని రాజకీయ నాయకుడిగా విమర్శలు చేస్తున్నారు.

    కానీ బాలయ్య ఏదో ఒకరోజు సీఎం అవుతారని అతడి అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. విశాఖ అర్బన్ టిడిపి కార్యదర్శి పసర్ల ప్రసాద్ మాట్లాడుతూ బాలయ్య అతి త్వరలో పూర్తికాల రాజకీయాల్లోకి రాబోతున్నారని అన్నారు.ఈ ప్రకటన టీడీపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. గుంటూరుకు చెందిన కొంతమంది టిడిపి నేతలు నారా చంద్రబాబు మరియు లోకేష్ నాయకత్వంలో టిడిపిని మళ్లీ గెలిపించడం సాధ్యం కాదని .. బాలయ్యను సీఎం చేయాలని కోరుతున్నారట..

    “నారా నుండి అధికార పగ్గాలు నందమూరి వంశానికి మారాలన్న డిమాండ్ మొత్తం టిడిపి కేడర్ ను వస్తోందట.. బాలయ్యను సీఎం చేయాలని భావిస్తున్నారట.. బుచ్చయ్య చౌదరి వంటి నాయకులు కూడా పార్టీని నడిపించడానికి జూనియర్ ఎన్టిఆర్ ముందుకు రావాలని బహిరంగంగా వ్యక్తం చేశారని గుర్తుంచుకోవాలి. కానీ జూనియర్ ఎన్టిఆర్ ఇప్పటికిప్పుడు ఆసక్తి చూపడం లేదు. కాబట్టి దీనిని తీవ్రంగా పరిగణించిన బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ నందమూరి ఇంటి వారసుడిగా, తన వియంకుడు చంద్రబాబు నాయుడు నుండి పార్టీ పగ్గాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలలో ఆయన సీఎం అభ్యర్థి అవుతారు “అని కొంతమంది టీడీపీ సీనియర్లు చెబుతున్నారు..

    బాలకృష్ణ, గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్టీ నాయకత్వం నారా-నందమూరి కుటుంబం నుంచి ఎవరికీ వెళ్ళడం లేదు. దీన్ని బట్టి వయసు అయిపోతున్న చంద్రబాబు నాయుడుకు కొంత విశ్రాంతి ఇస్తూ పార్టీని నడిపించాలనేది బాలయ్య ఆలోచన అని తెలుస్తోంది.

    “జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి క్రియాశీల రాజకీయాల్లోకి రాలేరు. అతని కెరీర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అతని రాజకీయ ఆసక్తి కూడా అంత స్పష్టంగా లేదు. కాబట్టి బాలకృష్ణ ఇప్పుడు అంతరాన్ని పూరించాలని నిర్ణయించుకున్నారు. బాలయ్యతో టిడిపి అధికారంలోకి రావాలని మేము కోరుకుంటున్నాము” అని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత చెప్పుకొచ్చారు.మరి బాలకృష్ణ వేసే రాజకీయ అడుగులు టిడిపి విధిని ఎలా మారుస్తాయో వేచిచూడాలి