
Poonam Kaur: అందరిది ఒక బాధ అయితే.. పూనమ్ కౌర్ ది మరో బాధ అన్న చందంగా తయారైంది ఆమె పరిస్థితి. పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా అనేక ఆరోపణలు చేస్తూ.. మధ్యమధ్యలో పవన్ ను సపోర్ట్ చేస్తూ అసలు ఆమె బాధ ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా సాగుతుంది పూనమ్ ప్రవర్తన. ఏది ఏమైనా టాలీవుడ్ లో #pklove అనే హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ ఎంతో వైరల్ అయింది. ఇక హిట్ అవ్వకుండానే ఫేడ్ అవుట్ అయిన ఈ పంజాబీ భామ తాజాగా మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంది.
మొదటి నుంచి తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నాను అంటూ పబ్లిక్ గానే చెప్పుకుంటూ వస్తోన్న ఈ బ్యూటీ… మా ఎన్నికల్లో ఓటు వేసి వచ్చాక కూడా ‘తాను ప్రకాశ్ రాజ్ ప్యానల్ కే ఓటేశానని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సందర్భంగా మా ఎన్నికల్లో రాజకీయాలు వద్దని’ అమ్మడు చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చింది. పైగా రాజకీయ లబ్ది కోసం ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టొద్దని కూడా పూనమ్ చెప్పుకొచ్చింది.
అన్నట్టు రీసెంట్ గా పూనమ్(Poonam Kaur) ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ సర్ గెలవాలి. ఓ విషయంలో ఇంతకాలం నేను నిశబ్థంగా ఉన్నాను. ఒకవేళ ప్రకాశ్ రాజ్ గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం నాకు ఉంటుంది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ వాస్తవికంగా ఉంటారు. ఆయన పై నాకు నమ్మకం ఉంది. ప్రకాష్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరు. అందుకే ఆయనకు నా మద్దతు ఉంటుంది. జైహింద్’ ఇది పూనమ్ ట్వీట్ చేసింది. మరి ప్రకాష్ రాజ్ గెలిస్తే.. పూనమ్ ఏమి బయట పెడుతుందో చూడాలి.
మానభంగం జరిగిందా?
మా ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై స్పందించారు. ‘ఏం గొడవ? ఎన్నికలు అన్నాక గొడవలు జరగవా? మర్డర్లు, మానభంగాలు జరగట్లేదు కదా.. కామ్ గా, బ్రహ్మాండమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు.. 26 మందిలో 26 మందీ గెలుస్తారు.. ప్రెసిడెంట్ గా ఒకరు, వైస్ ప్రెసిడెంట్ గా ఒకరు గెలుస్తారు.. ఇంకేం కావాలి? కచ్చితంగా చెప్పాలంటే నేను ఓటేసిన వాళ్లే గెలుస్తారు..’ అని బండ్ల గణేశ్ అన్నారు.