
MAA Elections Polling: ‘మా’ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చాలా విషయాలే చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ప్రత్యర్థులు కౌగిలించుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో విష్ణు, ప్రకాష్ రాజ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అన్నిటికీ మించి ప్రకాష్ రాజ్ మరో అడుగు ముందుకేసి, మోహన్ బాబు కాళ్లకు మొక్కడం మొత్తానికి ఇక అంతా సుఖంతామే అనుకున్నారు. ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కానీ ఉదయం నుంచి మిగిలిన నటీనటుల మధ్య పోరు కొనసాగుతూ వచ్చింది.
మొదట పోలింగ్ బూత్ లోపల ప్రచారం చేయవద్దు అన్న దగ్గర రభస స్టార్ట్ అయింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు పోలింగ్ బూతు లోపలకు వచ్చి మరీ ప్రచారం చేస్తున్నారని, అది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు అని మంచు విష్ణు వర్గీయులు గట్టిగా ఘాటుగా ఆరోపణలకు దిగారు. ఈ మధ్యలో ఇరువర్గాలకు చెందిన శివబాలాజీ, సమీర్ మధ్య మాటల తూటాలు పేలాయి.
ఒకరి పై ఒకరు సీరియస్ అయ్యారు. ఇద్దరు తిట్టుకున్నారు, కొట్టుకోవడానికి రెడీ అన్నట్టు ఆవేశపడ్డారు. దాంతో ప్రశాంతగా ఉన్న ఎన్నికల స్థలం ఉన్నట్టుంది ఒక్కసారిగా సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అంతలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ గన్ మెన్స్ పై సీరియస్ అయ్యాడు. వాళ్ళను బయటకు పంపించాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరాడు మోహన్ బాబు.
ఎన్నికల అధికారి కూడా ప్రకాష్ రాజ్ గన్ మెన్స్ ను బయటకు పంపించడం జరిగింది. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తపరిచారు. అప్పుడే నటుడు బెనర్జీ ఓట్ వేయడానికి వచ్చి.. ప్రకాష్ రాజ్ తో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఆ మాటలు విన్న మోహన్ బాబు ఒక్కసారిగా సీరియస్ అవుతూ.. ‘రేయ్ బెనర్జీగా’ అంటూ సీరియస్ గా చూస్తేనే ‘చంపేస్తా’ అంటూ మోహన్ బాబు తన ఉగ్రరూపం చూపించారు.
బెనర్జీ భయపడిపోయాడు. పక్కన ఉన్న ప్రకాష్ రాజ్ కూడా సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో లోపల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో బయట ఉన్న మంచు విష్ణు లోపలికి వచ్చారు. రగులుతున్న ఉద్రిక్తతల్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. అయితే, పక్కన ప్రకాష్ రాజ్ కూడా మంచు విష్ణుతో పాటు సభ్యులను కూల్ చేసే ప్రయత్నం చేశారు.
ఇక్కడే ఇద్దరి కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని, అలాగే బ్రహ్మానందం అంకుల్ హంగామా చేశారంటూ విష్ణు జోకులు వేశాడు.