https://oktelugu.com/

KTR: మోడీ గాడ్సే భక్తుడు.. దమ్ముంటే అరెస్టు చేయండి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శల వెల్లువ కొనసాగుతోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే విమర్శల దాడి చేస్తోంది. ఈ మేరకు మోడీని గాడ్సే భక్తుడిగా తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు అడపాదడపా మాటలనుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్ష దాడులకే మొగ్గు చూపడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానమంత్రినే టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ దాడి చేయడం వెనుక అంతర్మథనం […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2022 / 11:59 AM IST
    Follow us on

    KTR: దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విమర్శల వెల్లువ కొనసాగుతోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే విమర్శల దాడి చేస్తోంది. ఈ మేరకు మోడీని గాడ్సే భక్తుడిగా తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు అడపాదడపా మాటలనుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్ష దాడులకే మొగ్గు చూపడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానమంత్రినే టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ దాడి చేయడం వెనుక అంతర్మథనం ఏం దాగుంటుందనే ఆలోచన అందరిలో వస్తోంది. ఈ మేరకు కేటీఆర్ ప్రధాని మోడీపై ఇంత దారుణంగా విరుచుకుపడ్డారంటే ఏదో జరిగే ఉంటుందనే వాదనలు వస్తున్నాయి.

    KTR, MODI

    ప్రధాని నరేంద్ర మోడీ గాడ్సే భక్తుడిగా పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదివరకు అలా మాట్లాడిన జిగ్నేష్ ను జైల్లో పెట్టారు ఇప్పుడు నన్ను కూడా జైల్లో పెట్టినా నేను అదే మాట అంటాను. ముమ్మాటికి బీజేపీ నేతలు తీవ్రవాదులకంటే ప్రమాదకరమని చెబుతున్నారు. గతంలో ఓ రిపోర్టర్ కూడా మోడీకి వ్యతిరేకంగా పుస్తకం రాస్తే అతడిని కూడా అరెస్టు చేసి బంధించారు. వారి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోతున్నారు. అందుకే బీజేపీ నేతలు గాడ్సే భక్తులేనని కేటీఆర్ స్పందించడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దీనిపై బీజేపీ నేతలు కూడా తమదైన శైలిలో విమర్శలకు దిగే అవకాశం ఉంది.

    Also Read: Taptapani Waterfall: ఉష్ణధార.. ఆ జలపాతంలో 360 రోజులూ వేడినీటి ప్రవాహం

    మహాత్మాగాంధీని చంపిన వాడిని రాక్షసుడిగానే చూస్తారు. అందుకే బీజేపీ నేతల ప్రవర్తన అలా ఉందని కేటీఆర్ ట్విటర్ లో పేర్కొనడం తెలిసిందే. దీంతో రాజకీయ వైషమ్యాలు మరింత ముదిరే వీలుంది. ఇప్పటికే రెండు పార్టీల్లో విభేదాలు తారాస్థాయికి చేరిన క్రమంలో ప్రస్తుత పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ రాజకీయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీపై ధిక్కార స్వరం పెంచినట్లు రాజకీయవర్గాల విశ్లేషణ. కానీ ప్రధానిపైనే విమర్శలకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    KTR, MODI

    దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ అంతటి స్థాయి లేదని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ముందు రాష్ట్రం సంగతి చూసుకోవాలని తరువాత దేశం గురించి ఆలోచించాలని హితవు పలుకుతున్నారు సాక్షాత్తు ప్రధానిపైనే విమర్శలకు దిగడం సమంజసం కాదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. దేశాన్ని పాలించే వారిపైనే విమర్శలు చేయడం అంటే మొదట తన స్థాయిని చూసుకోవాలని చెబుతున్నారు. మొత్తానికి విమర్శల పర్వం ఎందాక వెళుతుందో తెలియడం లేదు.

    Also Read:Sudigaali Sudheer: పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్.. ఫీల్ అయిన రష్మీ.. రోజా వార్నింగ్..
    Recommended Videos


    Tags