https://oktelugu.com/

Roja: ఎక్స్ట్రా జబర్దస్త్ లో హీరోయిన్ పరువు తీసిన రోజా.. జంతువుతో పోలుస్తూ?

Roja: ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా మంత్రి పదవి దక్కడంతో సినిమాలకు, టీవీ షోలకు దూరమవుతున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రోజా పాల్గొన్న చివరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో స్పెషల్ స్కిట్ లో రోజా కూడా పాల్గొని సందడి చేశారు. ఈ షోలో క్యాష్ షో పేరడీ స్కిట్ చేయగా రోహిణి సుమలా యాక్ట్ చేశారు. రోజా రోహిణిని చూస్తూ క్యాష్ అంటే సుమ ఉంటుందని సుమో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 23, 2022 / 11:31 AM IST
    Follow us on

    Roja: ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా మంత్రి పదవి దక్కడంతో సినిమాలకు, టీవీ షోలకు దూరమవుతున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రోజా పాల్గొన్న చివరి ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో స్పెషల్ స్కిట్ లో రోజా కూడా పాల్గొని సందడి చేశారు. ఈ షోలో క్యాష్ షో పేరడీ స్కిట్ చేయగా రోహిణి సుమలా యాక్ట్ చేశారు. రోజా రోహిణిని చూస్తూ క్యాష్ అంటే సుమ ఉంటుందని సుమో ఉందేంటని కామెంట్ చేశారు.

    Roja

    రష్మీ, పూర్ణ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వగా రోజా పూర్ణతో తాను జాంబి రెడ్డి సినిమా చూశానని చెబుతారు. తాను ఆ సినిమాలో నటించలేదని పూర్ణ చెప్పగా ఆ సినిమాలోని జాంబీల కంటే నువ్వే ఎక్కువగా కొరుకుతున్నావట కదా అని రోజా కామెంట్ చేశారు. రోజా అలా కామెంట్ చేయడంతో పూర్ణ బుంగమూతి పెట్టుకున్నారు. రోహిణి ఈ క్రింది జంటల్లో ఏ జంటను చూస్తే చిరాకు వేస్తుందని అడగగా ఇమ్ము వర్ష, సుధీర్ రష్మీ జంటలను లేపిన నన్ను చూస్తే నాకు చిరాకు వేస్తుందని రోజా చెబుతారు.

    Also Read: Jeevitha Rajashekar: టాలీవుడ్‌లో కలకలం.. జీవితరాజశేఖర్‌ లపై కేసు !

    పూర్ణ నాది ప్రదీప్ జోడీ ఎందుకు పెట్టలేదని అడగగా ఆ జోడీని పెట్టడానికి కూడా చిరాకు వేసి పెట్టి ఉండరని రోజా కామెంట్ చేశారు. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా మారడానికి ఎంత సమయం పడుతుందని రోహిణి అడగగా ఎంత సమయమో చెప్పాలని రోజా కామెంట్ చేశారు. రామ్ ప్రసాద్ ఈ ప్రశ్నకు జవాబు సుమకు తెలుసు అని చెప్పగా ఆ ప్రశ్న క్యాన్సిల్ అని రోహిణి చెబుతారు. ఆ తర్వాత రోహిణి సుమ బాస్కెట్ లీగ్ నిర్వహించగా మనో గారు మీవల్లే జబర్దస్త్ కు రాలేదా అని రోహిణి రోజాను అడుగుతారు.

    రోజా మాట్లాడుతూ తోసితోసి చెయ్యి నొప్పి పుట్టడంతో ఆయన షోకు రాలేదని చెబుతారు. బాహుబలిలో అనుష్క పాత్ర చేస్తారా లేక శివగామి పాత్ర చేస్తారా అని రోహిణి రష్మీని అడగడంతో పాటు మీ వయస్సుకు శివగామి పాత్ర సెట్ అవుతుందని కామెంట్ చేశారు.

    Also Read: Rashmi: తోబుట్టువులు చనిపోయారు.. దత్తత తీసుకోండి.. రష్మీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    Recommended Videos: