వారిపై క్రిమినల్ కేసులకు కేటీఆర్ ఆదేశం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో 97పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్న ఒక్కరోజులోనే 15పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరికి ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతానికి వెళ్లొచ్చిన వారికి లింకు ఉండటంతో వీరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రార్థనలకు వెళ్లిచ్చొన వారికి కరోనా టెస్టులను నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తుంది. కరీంనగర్లో ఇండినేషియా, మర్కజ్ ప్రార్థనల లింకు బయటపడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 11:14 am
Follow us on

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో 97పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్న ఒక్కరోజులోనే 15పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరికి ఢిల్లీలోని మర్కజ్ ప్రాంతానికి వెళ్లొచ్చిన వారికి లింకు ఉండటంతో వీరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రార్థనలకు వెళ్లిచ్చొన వారికి కరోనా టెస్టులను నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తుంది.

కరీంనగర్లో ఇండినేషియా, మర్కజ్ ప్రార్థనల లింకు బయటపడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా లక్షణాలు వ్యక్తుల బయట తిరగకుండా క్వారంటైన్లోనే ఉంచాలని సూచించారు. వీరు బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్లో ఉన్న 1,032మందిని ఏప్రిల్ 7వరకు బయటికి రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారి పాస్ పోర్టులను రద్దు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలస కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న రోజులు ప్రభుత్వం వీరిందరికీ ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని, రైతులు వ్యవసాయ మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకురావద్దని సూచించారు.