https://oktelugu.com/

మర్కజ్ మసీదు మౌలాపై కేసు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింకు బయటపడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారాన్ని అందించింది. ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్థనల కోసం వెళ్లిన వివరాలను సేకరించి వారికి టెస్టులను చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా భారీ సంఖ్యలో ప్రార్థనలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు తగు చర్యలు చేపడుతున్నాయి. కాగా దేశంలో వెలువడుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 1, 2020 / 10:50 AM IST
    Follow us on

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింకు బయటపడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారాన్ని అందించింది. ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్థనల కోసం వెళ్లిన వివరాలను సేకరించి వారికి టెస్టులను చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా భారీ సంఖ్యలో ప్రార్థనలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు తగు చర్యలు చేపడుతున్నాయి. కాగా దేశంలో వెలువడుతున్న కరోనా కేసులకు ఢిల్లీ మర్కజ్ కు లింకు ఉండటంతో మసీదు మౌలాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

    మార్చి 10న మర్కజ్ మసీదులో ప్రార్థనల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశీయులు భారీగా హాజరయ్యారు. చైనా, ఇటలీ, ఇండోనేషియా, అమెరికా తదితరుల దేశాలకు చెందిన మతబోధకులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన ఢిల్లీ ప్రభుత్వం నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో మసీదు మౌలాపై కేసు నమోదు చేశారు.

    పార్థనల్లో పాలొన్న 1200మందిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ, కశ్మీర్లో ఇప్పటివరకు కరోనా చనిపోయిన వారంతా మర్కజ్ లో ప్రార్థనలు వెళ్లిన వారీగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈమేరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో ఢిల్లీ పోలీసులు పహారా చేస్తున్నారు. మర్కజ్ కు వెళ్లిచ్చిన వారి వివరాలను సేకరించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. వీలైనంత త్వరగా వీరిని ఐసోలేషన్ తరలించేందుకు సన్నహాలు చేస్తున్నాయి.