కరోనా వైరస్ కు గురైన వారికి సహకారం అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా `పిఎం కెర్స్’ పేరుతో నిధి ఏర్పాటు చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విపత్తు సమయంలో బాధితులను ప్రధాన మంత్రి/ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి సహకారం అందిస్తుంటాయి.
ముఖ్యమంత్రులు అందరు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు తీసుకొంటున్నారు గాని, ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై ఎకనామిక్స్ టైమ్స్ దిగ్బ్రాంతి కలిగించే అంశాన్ని వెల్లడించింది.
ప్రధాన మంత్రి సహాయానిధిలో ఉన్న నిధులలో కేవలం 15 శాతం మంత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన నిధులను పెట్టుబడులుగా పెట్టడంతో, అంటే వాటితో వ్యాపారం చేస్తూ ఉండడంతో అవి ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రస్తుతం పేరుకు రూ 3,800 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, అందుబాటులో నగదుగా రూ 486.79 కోట్లు మాత్రమే ఉన్నాయి.
రూ 250 కోట్లను యూనియన్ బ్యాంకు లో పెర్ఫెట్వల్ బాండ్స్ లో పెట్టుబడిగా పెట్టారు. వాటిపై వడ్డీ పొందడం తప్ప, ఆ మొత్తంన్ని తీసుకోవడానికి వీలు లేదు. బ్యాంకు లో ఉన్న మరో రూ 1,000 కోట్ల పెట్టుబడిపై 6 శాతం వడ్డీ వస్తుంది. ఒక సంవత్సరం తర్వాతనే తీసుకొనే వీలుంది.
2018-19లో ఈ నిధిలో రూ 1,301 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణాలకు ఇచ్చిన్నట్లు పేర్కొన్నారు. కానీ ఏ రాష్ట్రానికి తెలుపలేదు. 2018లో రూ 2,750 కోట్లను బ్యాంకు లలో ఫిక్సెడ్ డిపాజిట్ లుగా పెట్టుబడులు పెట్టారు.
2017-18లో పకృతి విపత్తులు, మత ఘర్షణలతో బాధితులకు రూ 180 కోట్లు సహాయంగా ఇవ్వగా, 2016-17లో రూ 104 కోట్లు ఇచ్చారు. కానీ 2018-19లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే వ్యక్తులకు లేదా ఆసుపత్రులకు వైద్య సహాయం కోసం రూ 160 కోట్లు ఇచ్చారు.
పీఎం సహయ నిధికి విరాళం ఇస్తే ఆదాయపన్ను రాయితీ పొందడం కోసం రసీదు ఇస్తారు. కానీ ప్రస్తుతం పిఎం కేర్స్ విరాళం ఇస్తే అటువంటిది ఏమీ లేదు. ప్రధాని అధ్యక్షతన పబ్లిక్ హరిటబుల్ ట్రస్ట్ గా ఏర్పాటు చేసారు.