Homeజాతీయ వార్తలుKTR: సంచలన ట్వీట్‌..కాంగ్రెస్‌తో ఫైట్‌కు కేటీఆర్‌ సై.. వైరల్ వీడియో

KTR: సంచలన ట్వీట్‌..కాంగ్రెస్‌తో ఫైట్‌కు కేటీఆర్‌ సై.. వైరల్ వీడియో

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌.. అధికార కాంగ్రెస్‌తో సమరానికి సై అంటోంది. అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తన ప్రసంగంలో దూకుడు ప్రదర్శించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తమకు 57 మంది బలం ఉందని, మీకు 65 మంది ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని చిన్న జలక్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సీఎం రేవంత్‌ దీటుగా సమాధానం ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ చేసిన విధ్వంసాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా డిసెంబర్‌ 20న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ సమరానికి సై అంటోంది. ఇక తమ వైపు నుంచి కూడా ఆట మొదలు పెట్టబోతోంది.

కర్ణాటక సీఎం వ్యాఖ్యలు వైరల్‌..
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి తాజాగా చేసిన షేర్‌ చేసిన ట్వీట్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి. అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు’’ అంటూ కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో ఉన్నాయి.

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ కామెంట్స్‌..
ఈ వీడియోని షేర్‌ చేసిన కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండోతోందా? అంటూ ప్రశ్నించారు. సాధ్యంకాని కపట వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. ఏమాత్రం పరిశోధన చేయకుండా మోసపూరిత వాగ్దానాలను ఎలా ఇస్తామరి ఫైర్‌ అయ్యారు. ఎలాంటి ప్లానింగ్‌ లేకుండానే హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ హామీలు కూడా అవే..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, ఆరు గ్యారంటీల్లోని కొన్ని అంశాలను తీసుకుని బీఆర్‌ఎస్‌ కాస్త అటూఇటుగా చేసి మెనిఫెస్టో రూపొందించింది. గ్యాస్‌ సిలిండర్‌ కాంగ్రెస్‌ రూ.500 అంటే బీఆర్‌ఎస్‌ రూ.400 అని, రైతుబంధు కాంగ్రెస్‌ రూ.15 వేలు అంటే, బీఆర్‌ఎస్‌ ఐదేళ్లలో రూ.16 వేలు అని, పింఛన్‌ రూ.4 వేలు అని కాగ్రెస్‌ పేర్కొంటే, తాము కూడా ఐదేళ్లలలో రూ.5 వేలు ఇస్తామని బీఆర్‌ఎస్‌ ఇలా చాలా హామీలను తన మేనిఫెస్టోలో చేర్చింది. అయినా బీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించలేదు. అప్పటికే వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పారు. కుటుంబ, అహంకార పూరిత పాలనకు స్వస్తి పలికారు. కాంగ్రెస్‌ హామీలను తప్పు పడుతున్న కేసీటీఆర్‌ తాము కూడా అవే హామీలు ఇచ్చామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అదే బీఆర్‌ఎస్‌ వస్తే ఎలా అమలు చేసేది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular