IPL 2024 Auction: 2024 ఐపీఎల్ మ్యాచులకు సంబంధించిన మినీ వేలం ఇవాళ్ల నిర్వహిస్తున్నరు. ఇక అందులో భాగంగానే ఆస్ట్రేలియా టీమ్ కు చెందిన ట్రావెల్స్ హెడ్ ని హైదరాబాద్ టీమ్ కొనుగోలు చేసింది.ఇక ఇప్పటికే హెడ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ టీం హోరాహోరీగా పోటీకి దిగినప్పటికీ సన్ రైజర్స్, హైదరాబాద్ టీం 6 కోట్ల 80 లక్షలకు ట్రావిస్ హెడ్ ని సొంతం చేసుకుంది. ఇండియా ఆడిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ట్రవిస్ హెడ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా టీం కి విజయాన్ని అందించాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఐపీఎల్ కోసం అన్ని ప్రాంచైజర్స్ ను ఆకర్షించాడు దాంట్లో భాగంగానే అతన్ని తీసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు టీం లు కూడా ఉత్సాహన్ని చూపించాయి అయినప్పటికీ ఈ సమరంలో హైదరాబాద్ టీం అతన్ని దక్కించుకుంది…
ఇక హైదరాబాద్ టీమ్ ఇప్పటికే బ్రుక్స్ లాంటి ఒక ప్లేయర్ ని వదిలేయడంతో అతని ప్లేస్ ను రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరు చేస్తారు అంటూ పలు రకాల ప్రశ్నలు అయితే తలెత్తాయి. హైదరాబాద్ యాజమాన్యం ఏ మాత్రం జంకకుండా చాలా కూల్ గా ఉండి ట్రావెల్ హెడ్ ని తమ టీం లోకి తీసుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అతన్ని టీవిలోకి తీసుకొని హైదరాబాద్ టీం ను మరింత స్ట్రాంగ్ గా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ టీం లో మర్కరం, క్లాసెన్ లాంటి ప్లేయర్స్ ఉండడంతో వాళ్లతో పాటుగా ట్రవిస్ హెడ్ కూడా చేరడం తో హైదరాబాద్ టీమ్ కి మరింత బలాన్ని చేకూర్చింది.
ముఖ్యంగా హైదరాబాద్ టీంలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అందులో భారీ హిట్టింగ్ చేసే ప్లేయర్లు ఎక్కువగా లేకపోవడమే ఇక హెడ్ రాకతో హైదరాబాద్ టీం బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది.ఎందుకంటే హెడ్ స్పిన్నర్ గా కూడా తన సత్తా చాటుకుంటాడు కాబట్టి ఆల్ రౌండర్ గా టీమ్ కి తన వంతు సేవలు అందించడానికి హెడ్ రెఢీ అయ్యాడు.
ఇక శ్రీలంక ప్లేయర్ అయిన హశ్రంగ ని కూడా హైదరాబాద్ టీమ్ 1.5 కోట్ల కి తీసుకొని చాలా మంచి పని చేసింది. వీళ్లిద్దరి రాకతో హైదరాబాద్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక వీళ్లిద్దరూ కూడా ఆల్ రౌండర్లు కావడం విశేషం…ఇక దీంతో హైదరాబాద్ టీమ్ అభిమానులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…