https://oktelugu.com/

కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

కేసీఆర్ ప్రధాని.. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి.. అబ్బా.. ఇది వింటేనే టీఆర్ఎస్ శ్రేణులకు ఊపొస్తోంది. సగటు తెలంగాణ వాదులకు కూడా అరే.. మనోడు ప్రధాని అయితే బాగుండు అని ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదట.. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తన కుమారుడు, ఐటి మంత్రి కెటిఆర్‌ను రాష్ట్రంలో తన వారసుడిగా అభిషేకం చేస్తారని తెలంగాణలోని రాజకీయ వర్గాలలో ప్రతిసారీ చర్చ జరుగుతోంది. Also Read: బడికెళ్లకుండానే పది […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 09:16 AM IST
    Follow us on

    కేసీఆర్ ప్రధాని.. కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి.. అబ్బా.. ఇది వింటేనే టీఆర్ఎస్ శ్రేణులకు ఊపొస్తోంది. సగటు తెలంగాణ వాదులకు కూడా అరే.. మనోడు ప్రధాని అయితే బాగుండు అని ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదట..

    టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తన కుమారుడు, ఐటి మంత్రి కెటిఆర్‌ను రాష్ట్రంలో తన వారసుడిగా అభిషేకం చేస్తారని తెలంగాణలోని రాజకీయ వర్గాలలో ప్రతిసారీ చర్చ జరుగుతోంది.

    Also Read: బడికెళ్లకుండానే పది పరీక్షలు.

    వ్యవసాయ బిల్లులు, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి ఎదురుతిరిగారు. ఆయన రైతుల తరుఫున జాతీయ ఉద్యమం దిశగా ఆలోచిస్తున్నట్టు మంత్రి తలసాని స్వయంగా తెలిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళితే.. కెటిఆర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రులు సహా టిఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.

    వాస్తవానికి ఇప్పటికే తెలంగాణలో కేటిఆర్ కూడా ఒక ముఖ్యమంత్రి వలే వ్యవహరిస్తున్నారు. ఒక సీఎంకు ఉండాల్సిన అన్ని ప్రోటోకాల్స్ ను అధికారులు అతడికి కల్పిస్తున్నారు. కేటీఆర్ ఒక్క తను నిర్వహించే ఐటి, పరిశ్రమలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణ అభివృద్ధి శాఖలనే కాదు.. ఇతర మంత్రుల శాఖలైన నీటిపారుదల మరియు ఆరోగ్యం వంటి ఇతర విభాగాల సమీక్షలలో పాల్గొని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నాడు.

    ఇటీవల మంత్రులు, అధికారులందరితో ముందస్తు క్యాబినెట్ సమావేశాన్ని కూడా కేటీఆర్ నిర్వహించి సీఎంలా ఫోకస్ అయ్యారు. దీంతో కేటీఆర్ ను  ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు తాజాగా మళ్లీ ఊపు వచ్చింది. కేసీఆర్ త్వరలో కొత్త జాతీయ పార్టీని పెట్టబోతున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.

    అయితే, సమీప భవిష్యత్తులో కేసిఆర్ తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో పోరాడటానికి కేసిఆర్ కు ముఖ్యమంత్రి కుర్చీ అవసరం. ఏ అర్హతలు లేకుండా జాతీయ రాజకీయాల్లో కొట్లాడితే విలువ ఉండదని కేసీఆర్ భావిస్తున్నారట.. నరేంద్రమోడీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేసి గెలిచాక ప్రధాని పదవి చేపట్టాడు. గుజరాత్ సీఎంకు రాజీనామా చేశాడు. ఆ తోవలోనే నడవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ రాజకీయాల్లో ముద్ర ఉండాలంటే తెలంగాణ సీఎం కుర్చీలోనే ఉండాలని భావిస్తున్నాడట.. ఒక జాతీయ పార్టీని పెట్టినా.. ఫెడరల్ ఫ్రంట్ ను పునరుద్ధరించినా తెలంగాణ సిఎంగా ఉంటూనే చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వర్గాలు తెలిపాయి.

    Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్

    తెలంగాణ సీఎం పదవి నుంచి దిగిపోయిన క్షణం నుంచి కేసీఆర్ కు జాతీయరాజకీయాల్లో తన గొంతును వినిపించేందుకు అర్హత కోల్పోతారని వారు అభిప్రాయపడుతున్నారు.

    “తెలంగాణ సీఎంగా లేకపోతే కేసీఆర్ ను  ఎవరూ తీవ్రంగా పరిగణించరు. కనీసం, అతడిని చూడటానికి.. ఆయనతో భేటికి కూడా ఇష్టపడరు అని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే ఇప్పట్లో కేటీఆర్ సీఎం కావడమనేది కల్లా అని చెబుతున్నారు.

     
    -నరేశ్