https://oktelugu.com/

స్మార్ట్‌ఫోన్లు లేని పేదలకు ఊరట.. రూ.4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌

ఒకప్పుడు పట్టణాలు, మేజర్‌‌ సిటీలకే పరిమితమైన ఇంటర్నెట్‌ సేవలు ఇప్పుడు పల్లెల్లోనూ జోరుగా వాడుతున్నారు. అదంతా జియోదే క్రెడిట్‌ అని చెప్పొచ్చు. ప్రతీ పల్లె వరకూ స్మార్ట్‌ ఫోన్‌ చేరిందంటే కూడా అది జియో వల్లే. ఇప్పుడు మొబైల్‌ రంగంలో మరింత దూసుకెళ్లేలా ముఖేశ్‌ అంబానీ ‘జియో స్మార్ట్‌ఫోన్‌’పై దృష్టి సారించారు. Also Read: బడికెళ్లకుండానే పది పరీక్షలు. దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నడుస్తున్నాయి. దీంతో చాలా వరకు కుటుంబాలు వేలల్లో ఉన్న ఫోన్లను సమకూర్చుకోలేని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 10:32 am
    jio smart phone

    jio smart phone

    Follow us on

    jio smart phoneఒకప్పుడు పట్టణాలు, మేజర్‌‌ సిటీలకే పరిమితమైన ఇంటర్నెట్‌ సేవలు ఇప్పుడు పల్లెల్లోనూ జోరుగా వాడుతున్నారు. అదంతా జియోదే క్రెడిట్‌ అని చెప్పొచ్చు. ప్రతీ పల్లె వరకూ స్మార్ట్‌ ఫోన్‌ చేరిందంటే కూడా అది జియో వల్లే. ఇప్పుడు మొబైల్‌ రంగంలో మరింత దూసుకెళ్లేలా ముఖేశ్‌ అంబానీ ‘జియో స్మార్ట్‌ఫోన్‌’పై దృష్టి సారించారు.

    Also Read: బడికెళ్లకుండానే పది పరీక్షలు.

    దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నడుస్తున్నాయి. దీంతో చాలా వరకు కుటుంబాలు వేలల్లో ఉన్న ఫోన్లను సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. విద్యార్థులు కొంత మంది పాఠాలకు దూరం అవుతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని త్వరలో రూ.4 వేలకే అన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చేందుకు ముఖేశ్‌ ప్లాన్‌ చేస్తున్నారట.రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.

    ఇప్పటికే ప్రతీ ఫోన్‌లోనూ జియో సిమ్‌ ఉండాలనే టార్గెట్‌తో జియో సేవలను తీసుకొచ్చారు ముఖేశ్‌. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కొనలేని పరిస్థితుల్లో ఉన్న 50 కోట్ల మంది చేతుల్లో ఈ ‘జియో స్మార్ట్‌ఫోన్‌’ ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, దేశీయ ఉత్పత్తి రంగం ఆ టార్గెట్‌ను అందుకోవడం సాధ్యం కాకపోవడంతో.. రెండేళ్ల కాలంలో 20 కోట్ల ఫోన్ల తయారీపై దృష్టిసారించారు.

    Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్

    అంబానీ తాజా నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిదారులకు ఊతమిచ్చినట్లవుతుందని ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 16.5 కోట్ల స్మార్ట్‌ ఫోన్లను ఉత్పత్తి చేసింది. బేసిక్‌ ఫోన్ల ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరిగిందని ఆయన చెప్పారు.  భారతీ ఎయిర్‌టెల్‌ కూడా సొంత బ్రాండ్‌తో 4జీ ఫోన్ల తయారీకి దేశీయ ఉత్పత్తిదారులను సంప్రదించిందని సమాచారం.