తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

సాధారణంగా ప్రజలకు సమస్యలొచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సీఎంలు పర్యటించి అక్కడి వారి కష్టాలు చూసి సాయం ప్రకటిస్తారు. ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లోనూ స్వయంగా సీఎంలే వెళ్లి చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరద బీభత్సంలో అపారనష్టం చోటుచేసుకుంది. వరంగల్ నగరం నిండా మునిగింది. దీంతో సాధారణంగా సీఎం కేసీఆర్ వెళ్లి ఈ సహాయ చర్యలు, నష్టపరిహారంపై బాధితులకు భరోసా ఇవ్వాలి. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. Also Read:  కెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో […]

Written By: NARESH, Updated On : August 19, 2020 10:42 am
Follow us on


సాధారణంగా ప్రజలకు సమస్యలొచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సీఎంలు పర్యటించి అక్కడి వారి కష్టాలు చూసి సాయం ప్రకటిస్తారు. ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లోనూ స్వయంగా సీఎంలే వెళ్లి చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరద బీభత్సంలో అపారనష్టం చోటుచేసుకుంది. వరంగల్ నగరం నిండా మునిగింది. దీంతో సాధారణంగా సీఎం కేసీఆర్ వెళ్లి ఈ సహాయ చర్యలు, నష్టపరిహారంపై బాధితులకు భరోసా ఇవ్వాలి. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది.

Also Read:  కెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడకండి

కేసీఆర్ స్థానంలో ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ వెళ్లి అన్నీ తానై వ్యవహరించాడు. సీఎంలా అధికారులను పరుగులు పెట్టించారు. వరంగల్ నిండా మునగడానికి కారణమైన ఆక్రమణలను కూల్చేయాలని.. దసరాలోపు పూర్తి చేయాలని అధికారులకు హుకూం జారీ చేశారు. అంతేకాదు.. వరంగల్ వరద ప్రాంతాల్లో పర్యటించి తక్షణ సాయంగా రూ.25 కోట్లు ప్రకటించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన సాయాలు, ప్రకటనలు అన్నీ కేటీఆర్ నుంచి రావడం విశేషం. ఇక కరోనా పీపీఈ కిట్స్ వేసుకొని రోగులను పరామర్శించే ధైర్యం చేశారు.

ఇలా అన్నింటా మంత్రి కేటీఆర్ సీఎంలాగానే ప్రవర్తించారని.. అందరి బాధలు విన్నారని.. ఏకంగా రూ.25 కోట్లు సాయం చేశారని వరంగల్ జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నాళ్లు కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ గా అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్కింగ్ సీఎంలా వ్యవహరిస్తుండడం విశేషం. కరోనా.. వర్షాల వేళ కేసీఆర్ హైదరాబాద్ కే పరిమితం కాగా.. యువకుడైన కేటీఆర్ ఇలా అన్నీ తానై పరిపాలన వ్యవహారాలను చూసుకుంటుండడంపై టీఆర్ఎస్ లో హర్షం వ్యక్తం అవుతోంది.

Also Read: దుబ్బాక బరిలో సీఎం కూతురు?

అయితే ప్రతిపక్షాలు మాత్రం సీఎం కేసీఆరా? కేటీఆర్ అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైతేనే ప్రజలకు కావాల్సింది సాయం.. భరోసా.. అది అందినప్పుడు ఎవరు చేసినా అది టీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలోకే వెళుతుంది. సో తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ సీఎం కాగా.. కేటీఆర్ వర్కింగ్ సీఎం అని అంటున్నారు.