https://oktelugu.com/

మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పై మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇవ్వబోతున్నారు. అదే రోజున ఫస్ట్ లుక్ […]

Written By:
  • admin
  • , Updated On : August 19, 2020 / 11:32 AM IST
    Follow us on

     


    సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పై మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇవ్వబోతున్నారు. అదే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ సినిమా మోషన్ పోస్టర్ టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతునట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. మోషన్ పోస్టర్ అంటే.. కాస్త విజువల్స్ తో పాటు మెగాస్టార్ గెటప్ అండ్ సెటప్ కూడా ఎలివేట్ అవుతుంది కాబట్టి, మెగా ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా మెగా ట్రీటే అవుతోంది.

    Also Read: పవన్ బర్త్ డే ట్రీట్ రెడీ అవుతుంది..

    ఇక ఈ మోషన్ పోస్టర్ కి మణిశర్మ అద్భుతమైన థీమ్ మ్యూజిక్ ఇచ్చాడట. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ తో పాటు ప్రభుత్వ కార్యాలయం సెట్ కూడా వేస్తున్నారు. నవంబర్ నుండి ఈ సెట్స్ లోనే వర్క్ చేయనున్నారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్ ను జరపాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉండనుంది. రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను ఎలా అరికట్టాలి, దీని కోసం ఎవరు పూనుకోవాలి, లాంటి ఆలోచనలను కొరటాల యాక్షన్ డ్రామాలో చెప్పబోతునట్లు తెలుస్తోంది.

    Also Read: హ్యాకర్ల బారినపడిన యంగ్ బ్యూటీ..!

    అందుకే ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల చూపించబోతున్నాడు. మెగాస్టార్ కూడా గతంలో ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ లో చేయకపోవడం కూడా ఈ సినిమాకి ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపించడానికే బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేస్తూ.. . యంగ్ లుక్ లోకి చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఇక మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా నటిస్తూ.. ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.