https://oktelugu.com/

షర్మిలకు షార్ట్ టెంపర్.. రాజకీయాల్లో పనికిరాదు: కొండా సురేఖ

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటు కొండా సురేఖ.. ఆయన చనిపోయాక జగన్ ను సీఎం చేయలేదని.. ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర కొండా సురేఖ సొంతం.. వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రాణం ఇచ్చేంతటి మనస్తత్వం. అలాంటి కొండా సురేఖ తాజాగా అదే కుటుంబంపై దారుణ కామెంట్స్ చేసింది.. వైఎస్ షర్మిలకు షార్ట్ టెంపర్ అని.. విజయమ్మ ఏడుపుకు ప్రజలు కరుగరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. జగన్ జైలుకు వెళ్లిన సమయంలోనూ వైఎస్ఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 9, 2021 / 07:53 PM IST
    Follow us on

    వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటు కొండా సురేఖ.. ఆయన చనిపోయాక జగన్ ను సీఎం చేయలేదని.. ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర కొండా సురేఖ సొంతం.. వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రాణం ఇచ్చేంతటి మనస్తత్వం. అలాంటి కొండా సురేఖ తాజాగా అదే కుటుంబంపై దారుణ కామెంట్స్ చేసింది.. వైఎస్ షర్మిలకు షార్ట్ టెంపర్ అని.. విజయమ్మ ఏడుపుకు ప్రజలు కరుగరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

    జగన్ జైలుకు వెళ్లిన సమయంలోనూ వైఎస్ఆర్ కుటుంబానికి కొండా సురేఖ మద్దతుగా నిలిచారు.అలాంటి ఈమె ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనమయ్యాయి. వైఎస్ఆర్ పై ఉన్న విధేయత షర్మిలపై లేదని తాజాగా వ్యాఖ్యలను బట్టి అర్థమైంది.

    అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి తెలంగాణను ముంచి ఆంధ్రాను బాగు చేసుకుందామనే ప్లాన్ తో వచ్చారో తెలియదంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా తాను ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు.

    షర్మిల ఇప్పుడు చేస్తుందంతా డ్రామా అని.. పెయిడ్ ఆర్టిస్ట్ మాదిరిగా వాళ్లదంతా జరుగుతోందని కొండాసురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఇగో ఎక్కువని.. అసలు.. ఆమె పార్టీలో చేరే ఆలోచన తనకు లేదంటూ తేల్చిచెప్పారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్ చూసానని చెప్పుకొచ్చారు. షర్మిలకు షార్ట్ టెంపర్ ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రాణించాలనుకునే వారికి అసలు అది పనికి రాదని సురేఖ వివరించారు. రాజకీయాల్లో సాఫ్ట్ గా.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు.

    ఇక విజయమ్మ పబ్లిక్ మీటింగ్స్ లలో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదని.. పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్లనుకుంటుందా అంటే ఘాటుగా సురేఖ ప్రశ్నించడం సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయురాలిగా పనిచేసిన కొండా సురేఖ రాష్ట్రవిభజన.. తెలంగాణ అంశాల కారణంగా ఆ కుటుంబంతో దూరమయ్యారు.. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబసభ్యులపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు.