https://oktelugu.com/

Konda Surekha : రాహుల్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు తీవ్రగాయాలు

వెంటనే ఆమె అనుచరులు హుటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2023 / 04:41 PM IST
    Follow us on

    Konda Surekha : కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ స్కూటీ నడుపుతూ అదుపుతప్పి కింద పడటంతో ఆమె ముఖానికి, చేతికి గాయాలయ్యాయి.

    వెంటనే ఆమె అనుచరులు హుటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు..

    ఈ క్రమంలోనే స్కూటీ నడుపుతూ అదుపు తప్పి పడిపోయారు.