Janasena in Telangana: జనసేన తెలంగాణలో పోటీ చేస్తే పొత్తులెలా ఉండాలి?

జనసేన తెలంగాణలో పోటీ చేస్తే పొత్తులెలా ఉండాలి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 19, 2023 5:02 pm

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.ఎ న్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో బిజెపి సైతం వ్యూహం మార్చింది. గెలుపునకు ఉన్న ఏ అవకాశాలను జారవిడుచుకోవడం లేదు. తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ లు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను కలుసుకొని చర్చలు జరపడం విశేషం.

ఇప్పటికే జనసేన తెలంగాణ ఎన్నికల్లో 32 మంది అభ్యర్థులను బరిలో దించునున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నగరం తో పాటు సెటిలర్స్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు నేరుగా పవన్ కార్యాలయానికి వచ్చి చర్చలు జరపడం విశేషం.

ఇప్పటికే జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. తెలంగాణలో కలిసి పోటీ చేయడంపై పవన్ తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నేతల మనోగతాన్ని పవన్ వారికి వివరించారు.

జనసేన తెలంగాణలో పోటీ చేస్తే పొత్తులెలా ఉండాలి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.