https://oktelugu.com/

కోమటిరెడ్డి లాబీయింగ్.. కాంగ్రెస్ లో ఉత్కంఠ?

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పడుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో అటు అధికార పార్టీతోపాటు.. ఇటు ప్రతిపక్ష పార్టీలు సైతం రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచి పోరాడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ వేడి ఇంకా చల్లారడం లేదు. సీనియర్లు ఆ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 / 02:20 PM IST
    Follow us on


    తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పడుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో అటు అధికార పార్టీతోపాటు.. ఇటు ప్రతిపక్ష పార్టీలు సైతం రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచి పోరాడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ వేడి ఇంకా చల్లారడం లేదు. సీనియర్లు ఆ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ పదవిలో ఎవరిని నియమిస్తున్నారనేది ఇంకా కొలిక్కి రావడంలేదు. పలువురు నాయకులు టీపీసీసీ పదవి రేసులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎవరి పేరు కూడా ప్రకటించలేదు.

    Also Read: కేసీఆర్‌‌ దిద్దు‘బాట’ చర్యలు

    టీపీసీసీ పదవి ఆశిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే చాలాసార్లు అధిష్టానాన్ని కలిసివచ్చారు. ఈ క్రమంలో మరోసారి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో కీలక నేతతో భేటీ అయ్యారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ కేరాతో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుత సమయంలో ఇద్దరి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌ వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసిన పవన్ ఖేరాతో కోమటి రెడ్డితో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డితోపాటు జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మధన్ మోహన్ రావుతో కలిసి పవన్ ఖేరా సమావేశమయ్యారు. వీరి మధ్య కొత్త పీసీసీ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరుగుతున్నట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి.

    Also Read: అగ్రి చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్

    కాంగ్రెస్‌ హైకమాండ్‌ టీపీసీసీ చీఫ్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్.. వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించే పనిలో పడింది. ఇందుకు సంబంధించి కసరత్తు దాదాపు పూర్తయ్యింది. వారం రోజుల్లో పీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి మరోసారి హైకమాండ్‌కు చెందిన ముఖ్య నేతలతో భేటీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు పలువురు సీనియర్ నాయకుల్ని కూడా ఢిల్లీకి పిలిపించుకొని అధిష్టానం చర్చలు జరుపుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్