https://oktelugu.com/

సీఎం స్థాయిలో ఉండి మాట మార్చడం ఏంటి..?

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు బాగా తెలుసు. అందుకే.. కేంద్రం నిర్ణయాలకు ముందుగా వ్యతిరేకత చెబుతూనే.. తర్వాత సపోర్టుగా నిలుస్తుంటారు. అటు పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ వ్యవహారాల్లోనూ అదే వెల్లడైంది. ఇక ఇప్పుడు వ్యవసాయ చట్టాల మీదా అదే స్టంట్‌ తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలను ముందుగా కేసీఆర్‌‌ వ్యతిరేకించారు. కానీ.. ఇప్పుడు మెల్లమెల్లగా స్వరం మార్చుతున్నారు. మరి ఇలా చేస్తే ప్రజల్లో కేసీఆర్‌‌పై నమ్మకం పోకుండా ఉంటుందా..? Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 3:26 pm
    CM KCR
    Follow us on

    KCR
    ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు బాగా తెలుసు. అందుకే.. కేంద్రం నిర్ణయాలకు ముందుగా వ్యతిరేకత చెబుతూనే.. తర్వాత సపోర్టుగా నిలుస్తుంటారు. అటు పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ వ్యవహారాల్లోనూ అదే వెల్లడైంది. ఇక ఇప్పుడు వ్యవసాయ చట్టాల మీదా అదే స్టంట్‌ తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలను ముందుగా కేసీఆర్‌‌ వ్యతిరేకించారు. కానీ.. ఇప్పుడు మెల్లమెల్లగా స్వరం మార్చుతున్నారు. మరి ఇలా చేస్తే ప్రజల్లో కేసీఆర్‌‌పై నమ్మకం పోకుండా ఉంటుందా..?

    Also Read: కోమటిరెడ్డి లాబీయింగ్.. కాంగ్రెస్ లో ఉత్కంఠ?

    ఆ చట్టాల వల్ల మేలు జరుగుతుందన్న సందేశాన్ని హఠాత్తుగా ఆదివారం ప్రజలకు పంపారు. అంతే కాదు.. ఆ చట్టాలను ఉపయోగించుకుంటూ ఇక గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేయాలని నిర్ణయించారు. దీంతో ఆ చట్టాలను అమలు చేయడం ఖాయమైంది. ఇక అధికారికంగా మద్దతు ప్రకటించడమే మిగిలింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆయన వ్యవసాయ చట్టాలపై యుద్ధమే ప్రకటించారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ.. టీఆర్ఎస్‌కు పోటీగా ఎదగడంతో రూటు మార్చాలని నిర్ణయించుకున్నారు. రెండు వారాల ఫామ్ హౌస్ విశ్రాంతి తర్వాత ఆయన చేసిన మొదటి సమీక్షలోనే ఆ విషయం స్పష్టమయింది.

    నిజానికి వ్యవసాయ చట్టాలపై తెలంగాణలో పెద్ద చర్చ అయితే ఏమీ జరగలేదు. కేంద్ర చట్టాలు తమపై ప్రభావం చూపుతాయని తెలంగాణ రైతులు కూడా అనుకోలేదు. అందుకే ఎవరూ ఆ చట్టాలపై ఆందోళనలు చేయలేదు. కానీ.. బీజేపీపై యుద్ధానికి ఆ చట్టాలే అస్త్రాలన్నట్లుగా కేసీఆర్ అందుకున్నారు. ఇక్కడ రైతుల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా.. ఉత్తరాదిలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. జాతీయ స్థాయిలో రైతుల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి జాతీయ నేతగా మారొచ్చన్న ప్లాన్ చేశారు. కానీ.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది.

    Also Read: అగ్రి చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్

    వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ ఇప్పటి వరకూ ఏం రెస్పాండ్‌ కాకుండా.. ఇప్పుడు అనుకూలంగా మాట్లాడి ఉంటే ప్రజల్లో పెద్దగా రియాక్షన్ వచ్చేది కాదు. కానీ ఆయన ఆ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించి.. యుద్ధం చేస్తామన్నట్లుగా మాట్లాడి.. ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకునే పరిస్థితికి రావడం ఆయన ఇమేజ్‌ ప్రజల్లో మరింత దిగజారిపోయేలా చేయడం ఖాయం. ఆయన బీజేపీకి లొంగిపోయారన్న ప్రచారం ఇక ఉద్ధృతంగా సాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్