https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ల ఇమ్యూనిటీ పిల్లలకు మంచిదా..? కాదా..?

దేశంలోని ప్రజలకు అతి త్వరలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకటికి మించి కరోనా వ్యాకిన్లు అందుబాటులోకి వస్తుండటంతో తక్కువ సమయంలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి వైరస్ సోకినా శరీరంలో ఉన్న యాంటీబాడీల వల్ల ఇన్ఫెక్షన్ సోకదు. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. Also Read: భారత్ లో కొత్త కరోనా కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే? అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 28, 2020 / 02:30 PM IST
    Follow us on


    దేశంలోని ప్రజలకు అతి త్వరలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకటికి మించి కరోనా వ్యాకిన్లు అందుబాటులోకి వస్తుండటంతో తక్కువ సమయంలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి వైరస్ సోకినా శరీరంలో ఉన్న యాంటీబాడీల వల్ల ఇన్ఫెక్షన్ సోకదు. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

    Also Read: భారత్ లో కొత్త కరోనా కేసులు.. ఇప్పటివరకు ఎన్నంటే?

    అయితే కరోనా వ్యాక్సిన్ ను చిన్నపిల్లలు తీసుకోవచ్చా..? తీసుకోకూడదా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కృత్రిమంగా రోగ నిరోధకత పెరుగుతుంది. ఫలితంగా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఉండవు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వ్యాక్సిన్ల సహాయంతో ఇప్పటికే చాలా వ్యాధులకు చెక్ పెట్టారు. చిన్నారులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఏం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ తో కొత్తరకం కరోనాకు చెక్..?

    చిన్నారులు, గర్బిణులు వ్యాక్సిన్ తీసుకుంటే పలు సందర్భాల్లో చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే తాత్కాలికంగా వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా దీర్ఘకాలంలో వ్యాక్సిన్ల వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. కొన్నిసార్లు వ్యాక్సిన్ ను తీసుకుంటే వాపు రావడం జరుగుతుంది. చాలామంది తల్లిదండ్రులు సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాక్సిన్లు వేయించడం లేదు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    ఒక సర్వే ప్రకారం దేశంలో 8 శాతం మంది అసలు వ్యాక్సిన్లు తీసుకోవడం లేదు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లను వేయిస్తే మంచిది. ప్రజలు వ్యాక్సిన్లపై అవగాహనను ఏర్పరచుకుంటే మాత్రమే పిల్లలు భవిష్యత్తులో వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.