Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయానికి పరోక్షంగా తామే కారణమని బాంబు పేల్చి అందరిని ఆశ్చర్యపరచారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన ఆయన అడుగడుగునా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఆయన తానేమిటో నిరూపిస్తానని చెబుతూ హడావిడి చేస్తున్నారు. రేపటి నుంచి తాను రంగంలోకి దిగుతున్నానని చెబుతూ అందరిలో ఆశ్చర్యం కలిగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన వీహెచ్ కు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, కామారెడ్డి నుంచి ఉద్యమం ప్రారంభించేందుకు సన్నద్దమవుతున్నట్లు ప్రకటించి అందరిలో ఉత్కంఠ రేపుతున్నారు. సోనియాగాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కోమటిరెడ్డి చేపట్టే ఉద్యమంపై స్పష్టత కానరావడం లేదు. ఆయన ఉద్యమం ఎవరిపై అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పైనా లేక రేవంత్ రెడ్డిపైనా అనేది స్పష్టంగా తెలియనివ్వడం లేదు. ఉద్యమం మాత్రం చేస్తానని చెబుతున్నారు.
ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేపట్టే ఉద్యమం ఏమిటన్న దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తన అసంతృప్తిని వినిపించడానికి ఓ వేదికను మాత్రం తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోనియాను పొగడటమే ధ్యేయంగా పెట్టుకుని రాష్ర్టంలో పార్టీపై దుమ్మెత్తిపోయడమే ఆయన తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Telangana Govt: తెలంగాణలో మద్యం దుకాణాల పెంపు.. ఇరకాటంలో సర్కార్