Dinesh Karthik Is Better Than Rohit: క్రికెట్లో జట్టును కీలక సమయాల్లో ఆదుకున్న వారినే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విజయతీరాలకు చేర్చేవాడే వీరుడు. అలాంటి పాత్రను మన దినేష్ కార్తీక్ నిర్వహించాడు. టీ20 మొదటి మ్యాచ్ లో ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగే ఆటలో దినేష్ కార్తీక్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి భారత్ కు విజయం దక్కడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అవసరమైన సమయంలో ఆదుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. అంతేకానీ అందరు ఆడినప్పుడు మనం కూడా ఆడితే దానికి అర్థం ఉండదు. జట్టు కష్టాలకు గురైనప్పుడు నేనున్నానని చాటిచెప్పే అవకాశం అందరికి రాదు. అది దినేష్ కార్తీక్ వచ్చింది. దీంతో జట్టు రుణం తీర్చుకున్నాడు.

దినేష్ కార్తీక్ పని అయిపోయిందనుకున్న ప్రతిసారి తన ఫర్మార్మెన్స్ చూపిస్తూ తానేమిటో నిరూపించుకోవడం దినేష్ కు అలవాటే. వ్యక్తిగత సమస్యలతో కొంత కాలం క్రికెట్ కు దూరంగా ఉన్నా ప్రస్తుతం తన సత్తా చాటుతూ క్రికెట్ కు ఆరాధ్యుడిగా నిలుస్తున్నాడు. విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు. భారత క్రికెట్ కు తన అవసరమేమిటో చెప్పకనే చెబుతున్నాడు. నెంబర్ 6లో వచ్చే పొజిషన్ ను కూడా ప్రత్యేకంగా చూసేలా చేయడంలో దినేష్ సఫలమయ్యాడు.
జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు దినేష్ కార్తీక్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దినేష్ కార్తీక్ బ్యాటింగ్ తోనే టీమిండియా 190 పరుగులు చేయగలిగింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 41 ఇందులో నాలుగు ఫోర్లు రెండు సిక్సులు ఉండటం గమనార్హం. వెస్టిండీస్ ను 122 పరుగులకే కుప్పకూల్చడంతో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించడం తెలిసిందే. ఈ ఘనత దక్కడానికి ప్రధాన కారణం దినేష్ కార్తేక్.
ప్రతిసారి కెప్టెన్ రోహిత్ శర్మనే ఎక్కువగా పొగుడుతుంటారు. కానీ ఈసారి మాత్రం దినేష్ కార్తీక్ ను ప్రశంసించాలి. ఎందుకంటే అతడు లేకపోతే ఆట ఉండేది కాదేమో. రెగ్యులర్ కు భిన్నంగా ఈసారి దినేష్ ఏడోస్థానంలో రావడం తెలిసిందే. ఏ స్థానంలో వచ్చినా బ్యాట్ తో సమాధానం చెప్పడమే అతని నైజం. టీమిండియాలోకి చేరిన వెంటనే తన సత్తా చాటే అవకాశం రావడం కూడా అతడికి అదృష్టమే. ఈ నేపథ్యంలో ఇండియా విజయంలో దినేష్ కార్తీక్ కు మంచి ఫామ్ కొనసాగించే అవకాశం రావడం గమనార్హం.