https://oktelugu.com/

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలి: చంద్రబాబు

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని చెప్పారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే కోడెలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2020 / 01:28 PM IST
    Follow us on


    వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని చెప్పారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే కోడెలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైకాపా నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు. ఈరోజు కోడెల శివప్రసాద్‌ జయంతి సందర్భంగా ఆయన ప్రజా సేవలను మననం చేసుకుందామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

    లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

    మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌లో కోడెల శివరాం రక్తదానం చేశారు. నరసరావుపేట ప్రజల కోసం తన ఆసుపత్రిని, ఇంటిని క్వారంటైన్ సెంటర్‌కు ఇస్తామని శివరాం తెలిపారు. నరసరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు తమ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని కోడెల శివరాం తెలిపారు.