Nara Lokesh Zoom Meeting- YCP Leaders: వైసీపీ పద్ధతి తప్పి ప్రవర్తిస్తోంది. ఆ పార్టీ నేతల తీరుపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వారు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరును అధికార పక్ష నేతలే తప్పుపడుతున్నారు. ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ప్రవేశించి అల్లరిచేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఇది కవ్వింపు చర్యల కిందకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ ‘వైఫల్యం’పై విద్యార్థులు, తల్లిదండ్రులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లోకి వైసీపీ నేతలు చొరబడ్డారు. విమర్శలు గుప్పించి, అడ్డదిడ్డమైన ప్రశ్నలు సంధించి, గేలి చేసేలా మాట్లాడి… లోకేశ్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు.
రచ్చ చేయాలనుకుని, చేయలేక ‘ఫెయిల్’ అయ్యారు. పదో తరగతిలో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో… ఈ అంశంపై పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు, తల్లిదండ్రులతో జూమ్ ద్వారా మాట్లాడాలని లోకేశ్ భావించారు. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలను బహిరంగంగా ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ‘జూమ్’ ద్వారా లోకేశ్ మాట్లాడుతుండగా… ఉన్నట్టుండి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తెరమీద ప్రత్యక్షమయ్యారు. కార్తీక్ కృష్ణ అనే పేరుతో లాగిన్ అయిన విద్యార్థి స్థానంలో కొడాలి నాని జూమ్ కాన్ఫరెన్స్‌లోకి రావడంతో.. వైసీపీ చొరబాటు మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి.. టీడీపీ టికెట్‌తో గెలిచి, వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ర్కీన్‌పై కనిపించారు. ఆయన ఏదో ‘కామెంట్’ చేసి… నవ్వారు. కానీ… ‘మ్యూట్’లో ఉండటంతో వినిపించలేదు. నవ్య అనే విద్యార్థిని స్థానంలో వంశీ ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత… గతంలో వైసీపీ సోషల్‌మీడియా సారథి బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం ప్రభుత్వ పదవిలో ఉన్న గుర్రం దేవేందర్ రెడ్డి జూమ్‌లోకి వచ్చారు. ‘‘నువ్వు, నీ బాబు చేసిందంతా కరెక్ట్ అనుకుంటున్నావా?’’ అని దురుసుగా మాట్లాడారు. ‘పదాలు హద్దు మీరకుండా మాట్లాడండి’ అని లోకేశ్ ఆయనకు సూచించారు.
Also Read: Ante Sundaraniki Review: అంటే సుందరానికీ మూవీ రివ్యూ
ఓపిగ్గా సమాధానం చెప్పిన లోకేష్..
వైసీపీ సానుభూతిపరులుగా భావిస్తున్న వారు అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఓపిగ్గా సమాధానం చెప్పారు. పరీక్షలు, సంబంధిత అంశాలపై అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సూటిగా బదులిచ్చారు. ఒక విద్యార్థిని జూమ్‌లో లాగిన్ అయి… తన బదులు తన బాబాయ్ మాట్లాడతారు అని చెప్పింది. ఆ తర్వాత బాబాయ్ లేడు, పిన్ని మాట్లాడుతుందని చెప్పింది. ఆ వెంటనే విజయవాడకు చెందిన వైసీపీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ ఒకరు తెరపైకి వచ్చారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వం పరీక్షలు పెడతామంటే మీరే వద్దన్నారు. అప్పుడు పరీక్షలు పెట్టనందుకే ఇప్పుడు ఇలాంటి ఫలితాలు వచ్చాయి అన్నారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ… అప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పరీక్షలు పెట్టలేదు. కొవిడ్ సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పాం. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు పరీక్షలు పెట్టాయి. అక్కడ ఉత్తీర్ణత శాతం బాగానే నమోదైంది. మన రాష్ట్రంలోనే తగ్గడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.
గడపగడపలో నిలదీత ఫలితమే..
వైసీపీ నేతలు జూమ్ కాన్ఫరెన్స్‌లోకి చొరబడటంపై లోకేశ్ మండిపడ్డారు. ‘‘గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు ఛీ కొడుతున్నారు. అందుకే… ఇక్కడకు వచ్చి కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. . విద్యార్థులను అడ్డుపెట్టుకుని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? జూమ్‌లో కాదు… నేరుగా వచ్చినా మీరేమీ చేయలేరు. పదో తరగతి ఫెయిలైన వైసీపీ కుక్కల్ని పంపడం కాదు! జగన్ రెడ్డీ… స్వయంగా నువ్వే రా! పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా సాక్షి చానల్‌లోనే చర్చించుకుందాం’’ అని లోకేశ్ సవాల్ చేశారు. జగన్ రివర్స్ పాలన వల్లే పదో తరగతిలో రివర్స్ ఫలితాలు వచ్చాయని లోకేశ్ విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖిలో అన్నారు. ‘‘కనీస అవగాహన లేని వ్యక్తి సీఎం అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. జగన్ మూర్ఖత్వంతో విద్యావ్యవస్థను నాశనం చేశారు. టెన్త్‌క్లాస్ పేపర్లు కొట్టేసి పరీక్షలు రాసిన ఆయనకు విద్యార్థుల కష్టం ఏం తెలుస్తుంది? పరీక్షల సమయంలో కూడా కరెంటు కోతలు పెట్టిన చెత్త ప్రభుత్వం ఇది.
Also Read:Jagan Politics: జగన్ ఎన్నికల జపానికి అసలు కారణం ఇదీ!