https://oktelugu.com/

Venkatapalem TTD Temple: అమరావతిపై అదే అక్కసు.. శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠకు సీఎం జగన్ డుమ్మా

Venkatapalem TTD Temple: ఏపీ సీఎం జగన్ అమరావతిపై తన అయిష్టతను మరోసారి బయటపెట్టారు. అసలు అమరావతి అంటేనే గిట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అసలు ఆ పేరు వినడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరుడు కొలువవడాన్నీ సహించలేకపోతున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా రాజధాని అభివృద్ధిపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామిదేవస్థానం నిర్మాణం తాజాగా పూర్తయింది. తొలుత రూ.140 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ ఆలయాన్ని.. జగన్‌ సర్కారు […]

Written By:
  • Dharma
  • , Updated On : June 10, 2022 / 08:15 AM IST
    Follow us on

    Venkatapalem TTD Temple: ఏపీ సీఎం జగన్ అమరావతిపై తన అయిష్టతను మరోసారి బయటపెట్టారు. అసలు అమరావతి అంటేనే గిట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అసలు ఆ పేరు వినడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరుడు కొలువవడాన్నీ సహించలేకపోతున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా రాజధాని అభివృద్ధిపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామిదేవస్థానం నిర్మాణం తాజాగా పూర్తయింది. తొలుత రూ.140 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ ఆలయాన్ని.. జగన్‌ సర్కారు వచ్చాక టీటీడీ రూ.31 కోట్లకే పరిమితం చేసింది. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ గురువారం ఘనంగా జరిగాయి. రాజధాని ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ఖరారుచేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ కార్యక్రమానికి సీఎం హాజరు కావలసి ఉంది. కానీ ఆయన రాలేదు. ఏకైక రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు తననకు వ్యతిరేకంగా నినాదాలు చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతోనే హాజరుకాలేదని తెలుస్తోంది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాత్రం హాజరయ్యారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు ఘనంగా నిర్వహించారు.

    Venkatapalem TTD Temple

    పక్కనే ఉన్నా..
    వాస్తవానికి టీటీడీ నిర్మించిన ఆలయం సీఎం నివాసానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరానే ఉంది. బయల్దేరితే ఐదే ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు. మహాసంప్రోక్షణకు హాజరుకావాలని మూడ్రోజుల కింద జగనే స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించారు. ఆ మేరకు గవర్నర్‌, సీఎం రాక కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా చేసింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్యలో ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి. అధికారులు, ఆలయ ప్రతినిధులు 10.30 వరకూ ఎదురుచూశారు. చివరకు ఆయన రావడం లేదని తేలిపోవడంతో గవర్నర్‌తోనే కార్యక్రమాన్ని ముగించారు. ఒకవేళ సీఎం అక్కడకు వచ్చి ఉంటే రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన పూర్తిస్థాయిలో కట్టిన ఆలయం గురించి మాట్లాడాల్సి వచ్చేది. ఆలయ ప్రాశస్త్యంతో పాటు కచ్చితంగా రాజధాని ప్రాంతంలోనే ఎందుకు కట్టారనేది కూడా ప్రస్తావించాల్సి వచ్చేది. అదే విధం గా రాజధానిలో అర్ధాంతరంగా ఆపేసిన భవనాలు, రోడ్ల పరిస్థితి గురించీ చెప్పాల్సి వచ్చేది. ఆయన చెప్పకపోయినా ఈ కార్యక్రమానికి వచ్చిన రాజధానివాసులు కచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అందుకే సీఎం డుమ్మా కొట్టారని తెలుస్తోంది.

    Also Read: Nara Lokesh Zoom Meeting- YCP Leaders: పద్ధతి తప్పిన వైసీపీ నేతలు…అసలు జూమ్ కాన్ఫరెన్స్ లో ఎందుకు ప్రవేశించినట్టు?

    JAGAN

    పోనీ ఏదైనా అత్యవసరమైన పనిలో పడి రాలేకపోయారా అంటే.. అదేమీ లేదు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ మధ్యలో సీఎం ఇతర ముఖ్యమైన భేటీ ఏదీ నిర్వహించలేదు. అయినా ఆయన హాజరుకాకపోవడానికి అమరావతిపై అయిష్టతే ప్రధాన కారణమని అర్థమైపోతోంది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణలే ప్రభుత్వం తరఫున ప్రధాన వక్తలుగా సందేశం వినిపించి కార్యక్రమాన్ని ముగించేశారు.

    సీఎంపై విమర్శలు..
    సీఎం జగన్ వ్యవహార శైలి అధికార పార్టీ నేతలకు సైతం మింగుడుపడడం లేదు. తానే అధికారికంగా ఆహ్వానాలు అందించి .. తాను మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉండడం విమర్శలకు గురిచేస్తోంది. ఇప్పటికే జగన్ కుటుంబంపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. ఈ పరిస్థితుల్లో కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహ ప్రతిష్టకు సీఎం హాజరుకాకపోవడం పెద్ద దుమారమే రేపుతోంది. అదే క్రైస్తవ పండుగలు, ప్రార్థనలకు సీఎం కుటుంబసమేతంగా హాజరవుతున్నారు. హిందూ పండుగలకు వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారన్న అపవాదు. ఈ నేపథ్యంలో రాజధానిలో జరిగిన దైవ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది.

    Also Read:Jagan Politics: జగన్ ఎన్నికల జపానికి అసలు కారణం ఇదీ!

    Tags