తెలంగాణలోని భూములపై పడ్డ కేసీఆర్ సర్కార్

కరోనా ఆర్థిక వ్యవస్థలను చావుదెబ్బ తీసింది. వ్యక్తులే కాదు.. ప్రభుత్వాలు కూడా కరోనా దెబ్బకు కుప్పకూలాయి. ఎవరికి దమ్మిడి ఆదాయం లేని పరిస్థితి. ప్రభుత్వాలకు ఆదాయం బాగా పడిపోయింది. ఆర్థికంగా సంపన్నమైన తెలంగాణ రాష్ట్రం కూడా నిధుల కోసం ఆపసోపాలు పడుతున్న దైన్యం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, ఆదాయం కుదుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే తెలంగాణలోని విలువైన భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని.. ఈ ఆర్తికకష్టాలు తీర్చుకోవాలని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. […]

Written By: NARESH, Updated On : June 11, 2021 11:35 am
Follow us on

కరోనా ఆర్థిక వ్యవస్థలను చావుదెబ్బ తీసింది. వ్యక్తులే కాదు.. ప్రభుత్వాలు కూడా కరోనా దెబ్బకు కుప్పకూలాయి. ఎవరికి దమ్మిడి ఆదాయం లేని పరిస్థితి. ప్రభుత్వాలకు ఆదాయం బాగా పడిపోయింది. ఆర్థికంగా సంపన్నమైన తెలంగాణ రాష్ట్రం కూడా నిధుల కోసం ఆపసోపాలు పడుతున్న దైన్యం కనిపిస్తోంది.

ఇప్పటికిప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, ఆదాయం కుదుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే తెలంగాణలోని విలువైన భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని.. ఈ ఆర్తికకష్టాలు తీర్చుకోవాలని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది.

నిధుల సమీకరణకు తెలంగాణలోని భూములను విక్రయించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కసరత్తును వేగవంతం చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ లోని విలువైన భూములను అమ్మి తెలంగాణ ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇకజిల్లాల్లోని భూములకు భారీగానే డిమాండ్ ఉందని అమ్మకానికి రెడీ అయ్యింది.

ఇక ఈ భూముల అమ్మకానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. భూముల విక్రయానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. భూముల అమ్మకం కోసం ఆక్షన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇక ప్రభుత్వ భూములు కొన్న వారికి ఎలాంటి నిర్మాణాలైనా చేసుకునేందుకు మల్టీపర్పస్ జోన్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఇక టీఎస్ బీపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భూములు కొని డబ్బులు చెల్లించిన ఏడు రోజుల్లోగా జిల్లా కలెక్టర్ ఆ భూమిని రిజిస్టర్ చేసి అప్పగించాల్సి ఉంటుంది.

ఇలా కష్టకాలంలో తెలంగాణలోని విలువైన భూములను అమ్మి సొమ్ము చేసుకొని ఆర్థిక బండిని నడపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. ఇలా అయినా సరే గల్లాపెట్టే నింపుకోవాలని నిర్ణయించుకున్నాడు.