https://oktelugu.com/

CM KCR: కేంద్రంతో అమీతుమీకే కేసీఆర్ సిద్ధం?

CM KCR: కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు రెడీ అవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సాక్షిగా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో అమీతుమీ తేల్చకోవాలనే ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకుగాను ప్రగతి భవన్ వేదికగా ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీలతో పాటు సీఎం సమావేశమై రెండు సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఇక ఊరుకునేది లేదని పేర్కొన్నారు. ఇన్నాళ్లు కేంద్రంపై ఉదాసీనంగా వ్యవహరించినా ఇక మీదట అలా ఉండదని అంతా […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 29, 2021 / 11:28 AM IST
    Follow us on

    CM KCR: కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు రెడీ అవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సాక్షిగా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో అమీతుమీ తేల్చకోవాలనే ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకుగాను ప్రగతి భవన్ వేదికగా ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీలతో పాటు సీఎం సమావేశమై రెండు సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఇక ఊరుకునేది లేదని పేర్కొన్నారు. ఇన్నాళ్లు కేంద్రంపై ఉదాసీనంగా వ్యవహరించినా ఇక మీదట అలా ఉండదని అంతా దబిడి దిబిడే అని తెలుస్తోంది.

    TS CM KCR and PM Narendra Modi

    ఈ మేరకు తెలంగాణకు రావాల్సిన కోర్కెలు తీర్చకపోగా రాష్ర్ట ప్రభుత్వంపైనే కేంద్రం కారాలు మిరియాలు నూరుతున్న క్రమంలో రెండు పార్టీల్లో అభిప్రాయ భేదాలు పొడచూపాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించడంతో కేసీఆర్ ఇక బీజేపీని రాష్ర్టంలో ఎదగనివ్వొద్దనే ఉద్దేశంతోనే అడుగడుగునా అడ్డుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసమే ధాన్యం కొనుగోలును సాకుగా చూపి ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి తనలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

    ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఇలా చేశారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం రాష్ర్టం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంతలా విభేదాలు ముదిరిపోయాయి. ధాన్యం కొనుగోలులో కేంద్రాన్ని సాకుగా చూపాలని రాష్ర్ట ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకుగాను అన్ని దారులు వెతుకుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అసలు పీఎం అపాయింట్ మెంట్ తీసుకోలేదని తెలియడంతో అందరు ఆశ్చర్యపోయారు. సొంత పనుల మీద ఢిల్లీ వెళుతూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారనే వాదన బీజేపీ నేతలు బహిర్గతం చేస్తున్నారు.
    Also Read: CM KCR: ఢిల్లీ టూర్‌తో ఫెయిల్ తో మౌనంగా సీఎం.. కొత్త ప్లాన్ ఏంటి ?

    మరోవైపు రాష్ర్టంలో నదీ జలాల సమస్య, విభజన హామీలు, కనీస మద్దతు ధర చట్టం, కృష్ణా జలాల్లో వాటా కోసం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసీఆర్ ఎంత మాత్రం విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.
    Also Read: తెలంగాణలో రాజకీయ కాక.. బీజేపీతో టచ్ లో ఉన్న ఆ పాతిక మంది ఎవరు?

    Tags