Gautama Buddha: ప్రపంచానికి గౌతమ బుద్ధుడు చూపిన మార్గం ఆచరణీయం. సత్యం, అహింస, జీవహింస వద్దంటూ మానవాళి మనుగడకు మంచిని బోధించాడు. క్షత్రియుడైన గౌతముడు అన్నింటిని త్యజించి సత్యశోధన కోసం అహర్నిశలు శ్రమించాడు. మనిషి జీవితంలో ఏ పొరపాట్లు చేయకూడదో కూడా వివరించాడు. దీంతో ప్రపంచంలోని కొన్ని దేశాలు గౌతమ బుద్ధుడి మార్గాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు. చైనాలో అత్యధికులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నారు.
అయితే బుద్ధుడు ధ్యానం చేస్తున్న సమయంలో అతడికి నత్తలు సాయం చేసిన విషయం చాలా మందికి తెలియదు. గౌతముడు అన్నింటిని త్యజించి అడవిలోకి వెళ్లే సమయంలో జుట్టును మొత్తం కత్తిరించుకున్నాడట. కానీ ఏ విగ్రహంలో చూసినా గౌతముడి తలపై జట్టు ఉన్నట్లు కనిపిస్తోంది. అది జుట్టు కాదు నత్తలే. ఇందులో ఆసక్తికర కథ ఒకటి ప్రచారంలో ఉంది. నత్తలు గౌతముడికి ఎండ తగలకుండా ఉండేందుకే అతడి తలపై ఉన్నాయని చెబుతారు.
Also Read: ఈ రూపాయి మీ దగ్గర ఉంటే 2.5 లక్షలు మీవే.. ఎలా అంటే?
ఒక రోజు గౌతముడు చెట్టు కింద కూర్చుని దీక్ష చేసుకుంటున్న సమయంలో ఎండ తీవ్రంగా ఉన్న విషయం తెలుసుకుని ఒక నత్తా బుద్ధుడి వైపు వెళ్లి అతడి నెత్తిపై ఎండ తగలకుండా ఉండేందుకు సాయపడుతుంది. దీంతో అది చూసిన మరికొన్ని నత్తలు కూడా అదే తీరుగా బుద్ధుడి ధ్యానం చెడిపోకూడదనే ఉద్దేశంతో అన్ని ఆయన నెత్తి మీద కూర్చుని అతడి తపస్సుకు భంగం కలగకుండా చేస్తాయి.
కానీ చివరకు ఎండ ప్రభావంతో మరణిస్తాయి. సాయంత్రం అయ్యే సరికి బుద్ధుడి ధ్యానం అయిపోయి చూసుకునే సరికి నత్తలు అన్ని చనిపోయి ఉంటాయి. నత్తలు కూడా బుద్ధుడి కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టడంతో ఆయన విగ్రహాల్లో నెత్తిమీద నత్తలు ఉండటం గమనార్హం. బుద్ధుడి ధ్యానం కోసం ప్రాణాలు అడ్డుగా పెట్టి అతడి ధ్యానమార్గానికి సహకరించిన నత్తల జన్మ కూడా అర్థవంతమైనదే.
Also Read:శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసిన టీటీడీ అధికారులు..ఎలా బుక్ చేయాలంటే?