spot_img
Homeఎంటర్టైన్మెంట్Bollywood Hero In Peddi: 'పెద్ది' సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ హీరో...

Bollywood Hero In Peddi: ‘పెద్ది’ సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ హీరో…

Bollywood Hero In Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుంటాయి. వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా అవతరించాడు. గ్లోబల్ స్టార్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు… ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాని చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు… ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్బీర్ కపూర్ సైతం ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. అది క్యామియో కాకుండా సినిమాలో భాగమైన క్యారెక్టర్ కావడం విశేషం…

ఇక రన్బీర్ కపూర్ సైతం ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అనిమల్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి తెచ్చుకున్నాడు. అతన్ని ఈ సినిమాలో భాగం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రామ్ చరణ్ తో పోటీ పడే క్యారెక్టర్ కావడం వల్ల అతన్ని తీసుకున్నారట. నిజానికి ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఎవ్వరికి తెలియదు.

అతను పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడా? నెగిటివ్ క్యారెక్టర్ ను ప్లే చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఆయన నుంచి వచ్చిన గ్లింప్స్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా అతని క్రేజీ ఏమాత్రం తగ్గలేదు… కానీ తన తోటి హీరోలు తనను బీట్ చేసి ముందుకు సాగుతున్నారు.

కాబట్టి ఇలాంటి పోటీ వాతావరణంలో ఒక్క సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న కూడా మార్కెట్ పరంగా కొంతవరకు వెనకడుగు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పెద్ది సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version