spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rayalaseema Lift Irrigation: వైసీపీ సౌండ్.. బిఆర్ఎస్ సైలెన్స్

Rayalaseema Lift Irrigation: వైసీపీ సౌండ్.. బిఆర్ఎస్ సైలెన్స్

Rayalaseema Lift Irrigation: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పై గట్టి పోరాటమే చేస్తోంది. చంద్రబాబుతో మాట్లాడి తాను రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపానని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. అయితే ఆ ప్రాజెక్టు పనులను తానే నిలిపివేసిన విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కనీసం అనుమతులు తీసుకోకుండా.. అసలు సరైన ప్రణాళిక లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దిగారు జగన్మోహన్ రెడ్డి. ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతగా ఆ ప్రాంతానికి న్యాయం చేశానని ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేలా చేశారు. కానీ అనుమతులు తీసుకోకపోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అదే సమయంలో తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఎలాగూ అనుమతులు లేవు కాబట్టి కేంద్రం ఆదేశాలతో పనులు నిలిపివేశారు జగన్మోహన్ రెడ్డి.

* అప్పుడే నిలిచిపోయిన ప్రాజెక్ట్.. రాయలసీమ( Rayalaseema ) ఎత్తిపోతల పథకం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ ప్రకటనతో దానికి జీవం పోస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాట బాట పట్టింది. ఇదే చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలన్న లక్ష్యంతో నదీ జలాల మిగులతో రాయలసీమకు నీరు పంపించాలని ప్రణాళిక వేశారు. తెలంగాణ సమాజం నుంచి దానికి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అక్కడ అధికార కాంగ్రెస్ తో పాటు గులాబీ పార్టీ కూడా వ్యతిరేకించింది. కానీ ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు ప్రయత్నాన్ని సమర్థించలేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఆందోళనలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణలో కెసిఆర్ పార్టీ మాత్రం కనీసం దీనిపై స్పందించడం లేదు. అదే ఏపీలో ఇతర పార్టీలు చేసి ఉంటే ఈపాటికి గులాబీ పార్టీ సౌండ్ చేసేది.

* ఉమ్మడి శత్రువు ఉండడంతో.. తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీ, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్థితిలో ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు చంద్రబాబు. ఆపై కాంగ్రెస్ పార్టీ అన్న పడదు. బిజెపితో చేతులు కలుపుతాం అంటే కుదరదు. ఎల్లవేళలా బిజెపి నుంచి సహాయం దొరికే పరిస్థితి కూడా లేదు. అందుకే సమిష్టిగా ముందుకు వెళుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు విషయంలో రాజీ పడుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సజ్జల నేతృత్వంలో సభ పెడితే గులాబీ పార్టీ కనీసం కిక్కురు మనలేదు. అదే టిడిపి నేతలు ఎవరైనా అలాంటి విచ్చేసి ఉంటే మాత్రం కెసిఆర్ నేతృత్వంలోని గులాబీ పార్టీ నేతలంతా బయటకు వచ్చి విమర్శలు చేసేవారు. ఆ పార్టీ అధికార పత్రిక నమస్తే తెలంగాణ వ్యతిరేక వార్తలతో నింపేసేది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి.. చంద్రబాబు సర్కారు ఉంది కాబట్టి.. వైసీపీకి రాజకీయ ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైలెంట్ పాటిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version