KCR meets Stalin: దేశంలో బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే నిన్న కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశం జరిపారు. ఈ మేరకు బీజేపీ దక్షిణాదిలో బలపడకుండా చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమితో బీజేపీకి చెక్ పడే సూచనలు కనిపించడం లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే కేసీఆర్ ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసకుంటున్నట్లు సమాచారం.
ప్రాంతీయ పార్టీల ఎదుగుదలను దెబ్బతీసి దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఇందుకోసమే బలంగా ఉన్న పార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే అందరు సీఎంలను ఒకే వేదికపైకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
దక్షిణ భారతదేశంలో బీజేపీకి పట్టు లేదని తెలుస్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి బీజేపీ తన ప్రభావం చూపాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. దీని కోసమే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ అధికారం కోసం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టే క్రమంలో అందరు ఐకమత్యంగా ఉండాలని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో వ్యూహాలు ఖరారు చేసి బీజేపీని దెబ్బతీసేందుకు ప్రాంతీయ పార్టీల ఐక్యతను గుర్తించాల్సిన అవసరం గురించి చెప్పారు. కానీ దీనిపై స్టాలిన్ ఏ మేరకు స్పందిస్తారో తెలియడం లేదు. ఏదిఏమైనా కేసీఆర్ చెప్పిన విధానానికి స్టాలిన్ ఎంత మేరకు మద్దతు ఇష్తారో వేచి చూడాల్సిందే.
Also Read: TRS: టీఆర్ఎస్‌ను కమ్మేసిన నిశ్శబ్దం.. సెలబ్రేషన్స్‌కు కేడర్ దూరం.. అసలేమైంది?