https://oktelugu.com/

Balayya: మంచి కథతో వస్తే మల్టీస్టారర్​కు రెడీ అంటున్న బాలయ్య

Balayya: బోయపాటి- బాలయ్య కాంబోలో సూపర్​డూపర్​ హిట్​గా నిలిచిన సినిమా అఖండ. విడుదలై 10 రోజులు పూర్తయినా.. ఇంకా థియేటర్లు హౌస్​ఫుల్​ అవుతూనే ఉన్నాయి. కాగా, తాజాగా అఖండ టీం బెజవాడలో సందడి చేసింది. బాలయ్యతో పాటు బోయపాటి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. అఖండ సినిమా విజయం సాధించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అన్నారు. ఈ సందర్భంగా అమ్మారి ఆశీస్సులను తీసుకోడానికి వచ్చినట్లు.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 10:05 AM IST
    Follow us on

    Balayya: బోయపాటి- బాలయ్య కాంబోలో సూపర్​డూపర్​ హిట్​గా నిలిచిన సినిమా అఖండ. విడుదలై 10 రోజులు పూర్తయినా.. ఇంకా థియేటర్లు హౌస్​ఫుల్​ అవుతూనే ఉన్నాయి. కాగా, తాజాగా అఖండ టీం బెజవాడలో సందడి చేసింది. బాలయ్యతో పాటు బోయపాటి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. అఖండ సినిమా విజయం సాధించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అన్నారు.

    Balayya

    ఈ సందర్భంగా అమ్మారి ఆశీస్సులను తీసుకోడానికి వచ్చినట్లు.. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారని బాలయ్య పేర్కొన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో.. మరిన్నీ పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు ఇకపై థియేటర్లకు వస్తాయని.. ప్రేక్షకులు ఆ ధైర్యం ఇచ్చారని వివరించారు. దర్శకులు ముందుకొచ్చి కొత్త కథలు తీసుకొస్తే.. మల్టీస్టారర్ చేయడానికీ రెడీగా ఉన్నట్లు తెలిపారు బాలయ్య.

    Also Read: టికెట్ రేటు విషయంలో హైకోర్టు తీర్పుపై… డివిజనల్ బెంచ్ లో పిటిసన్ వేసిన ఏపీ సర్కారు

    ఈ సినిమా విడుదలైన తొలిరోజు అమెరికాలో బాక్సాఫీసును బద్దలు కొట్టింది. ఇండియాలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాతో బాలయ్య అభిమానులైపోయారు. ఆ విజువల్స్​కు, బాలయ్య నటనకు నీరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా అఘోరాగా కనపించిన బాలయ్యను సాక్షాత్తు శివ స్వరూపంగా భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా కనిపించగా.. శ్రీకాంత్​, జగపతి బాబు కీలకపాత్రల్లో కనిపించారు. మరోవైపు థమన్​ సాలిడ్​ మ్యూజిక్​ అందించారు.

    Also Read: బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో తర్వాత గెస్టులుగా జక్కన్న, పెద్దన్నలు