Early Elections In Telangana: కేసీఆర్ ఆ ప్లాన్ చేస్తారా? విపక్షాల ఉరుకులు, పరుగులకు కారణం అదేనా?

Early Elections In Telangana: తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల్లో ముంద‌స్తు జ్వ‌రం ప‌ట్టుకుంది. ఇప్ప‌టికే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ‌చ్చే డిసెంబ‌ర్ లో అసెంబ్లీని ర‌ద్దు చేసి మార్చిలో ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని జోస్యం చెప్ప‌డంతో ఆ దిశ‌గా అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇందులో నిజ‌మెంతో కానీ ప్ర‌తిప‌క్షాల్లో మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో పార్టీలు కూడా ఆ […]

Written By: Srinivas, Updated On : March 7, 2022 10:16 am
Follow us on

Early Elections In Telangana: తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల్లో ముంద‌స్తు జ్వ‌రం ప‌ట్టుకుంది. ఇప్ప‌టికే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ‌చ్చే డిసెంబ‌ర్ లో అసెంబ్లీని ర‌ద్దు చేసి మార్చిలో ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని జోస్యం చెప్ప‌డంతో ఆ దిశ‌గా అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇందులో నిజ‌మెంతో కానీ ప్ర‌తిప‌క్షాల్లో మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో పార్టీలు కూడా ఆ దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

CM KCR

అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనే క్ర‌మంలో పాటించాల్సిన వ్యూహాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర ఆలోచిస్తున్న క్ర‌మంలో ముంద‌స్తుకు వెళ్ల‌రనే అభిప్రాయం కొంత‌మంది నేతల్లో వ‌స్తోంది. అయితే చాలా మంది కేసీఆర్ ముంద‌స్తుకు వెళ‌తార‌నే వాద‌న తెస్తున్నారు. దీంతోనే తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు మార‌నున్న‌ట్లు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు వ‌స్తాయోన‌నే సందేహం అంద‌రిలో వ‌స్తోంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తో స‌మావేశ‌మైన త‌రువాత కేసీఆర్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పులు వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ముంద‌స్తుకు వెళ‌తార‌నే ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం ముంద‌స్తుకు వెళ్లే ధైర్యం చేయ‌ర‌నే అభిప్రాయం అంద‌రిలో వ‌స్తోంది.

CM KCR

2018లో అనుస‌రించిన వ్యూహాన్నే అమ‌లు చేస్తార‌నే విష‌యం అంద‌రిలో వ‌స్తోంది. దీంతో ముంద‌స్తు కోసం బీజేపీ సైతం ఆలోచ‌న చేస్తోంది. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాల‌ని పావులు క‌దుపుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ అనే వాద‌న ఎప్పటి నుంచే చేస్తోంది. కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లతో పార్టీ భ‌విత‌వ్యం అగ‌మ్య‌గోచ‌రంగా మారిన ప‌రిస్థితుల్లో పోటీ ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్యే ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

Tags