Pawan Kalyan: రాజకీయాల్లో సంచలనం కలిగించాలని మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. దీనికి కారణాలు వేరే ఉన్నాయి. చిరంజీవి చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చినా అంతే స్థాయిలో నిలవలేకపోయారు. రెండేళ్లలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పార్టీ కార్యకర్తలను నిరాశ పరిచారు. సీఎం అయ్యే అవకాశమున్నా ఆయన సద్వినియోగం చేసుకోలేదనే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయారు. ఫలితంగా ప్రజారాజ్యం పార్టీ మధ్యలోనే ఆగిపోవడం తెలిసిందే.
అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి పవన్ కల్యాణ్ వెన్నుదన్నుగా నిలిచారు. ప్రచారంలో దూసుకుపోయారు. ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగి పార్టీని గెలిపించాలని కోరారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ప్రజారాజ్యం పార్టీ మాత్రం ముందుకు కదలలేదు. పార్టీ మనుగడ సాధించలేకపోవడంతోనే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చిరు అంగీకరించారు. తరువాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే.
Also Read: జనసేన ఆవిర్భావ సభపై నాదెండ్ల మనోహర్ సీరియస్ కామెంట్స్
ప్రజారాజ్యం పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నేటికి కూడా ఉన్నారు. వారిని జనసేనలోకి తీసుకొచ్చేందుకు పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఓ వైపు వైసీపీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. పైగా టీడీపీ పాలన కూడా చూశారు. ఇంకా కొత్తగా ఎవరైనా రావాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రంలో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఓ వెలుగు వెలిగిన వారిని తిరిగి జనసేనలోకి తీసుకువచ్చి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. దీనికి గాను కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే వైసీపీపై నిప్పులు చెరుగుతున్న పవన్ కల్యాణ్ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు జనసేనలో చేరాలని చూస్తున్నారు. మరోవైపు కాపు నేతలంతా కలిసి జనసేన ను గెలిపించుకుని పవన్ కల్యాణ్ ను సీఎం గా చూడాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరి తమ ప్రభావం చూపించి రాజకీయాల్లో కాపులకు కూడా పదవి కావాలని ఆశిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికారం అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ పొత్తులతోనైనా సరే అధికారం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నందున ఎంత మేర లబ్ధి చేకూరుతుందో అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఇంకా పొత్తులు మారాలా లేక బీజేపీతోనే ఉండాలా అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
దీంతో రాబోయే రోజుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపించాలసిన బాధ్యత పవన్ కల్యాణ్ పైనే ఉంది. అందుకే ఆయన అధికారం కోసం కలిసి వచ్చే పార్టీ గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.