Site icon OkTelugu

Vivo New Phones: త్వరలో మార్కెట్లోకి రాబోతున్న Vivo కొత్త ఫోన్లు ఇవే..

Vivo New Phones

Vivo New Phones

Vivo New Phones: చైనాకు చెందిన Vivo కంపెనీ భారత వినియోగదారులకు అనుగుణంగా మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరా కావాలని అనుకునేవారు ఈ కంపెనీకి చెందిన ఫోన్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని.. వారికి అనుగుణంగా అప్డేట్ చేసిన డివైస్ లను ఈ కంపెనీ తీసుకు వస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాదిలో ఈ కంపెనీ కొన్ని మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తుంది. ఎందుకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి రాబోయే ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

Vivo V70: ఈ ఈ మొబైల్ ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది 8జిబి రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 40 MP మెయిన్ కెమెరా ఉండడంతో పాటు 12 MP అల్ట్రా వైడ్ కెమెరా పనిచేయనుంది. అలాగే ఇది 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.

Vivo V70 Elite: ఈ మొబైల్ లో 6.9 అంగుళాల OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.5000 నిట్స్ బ్రైట్నెస్ తో పని చేసే ఇందులో 6,500 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 90W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. అలాగే ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. స్నాప్ డ్రాగన్ 8 S తో పనిచేస్తుంది.

Vivo X200T: ఈ మొబైల్ లో 6.67 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో పాటు..32 MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఈ మొబైల్లో 6,200 mAh బ్యాటరీ ఉండనుంది.

ఈ మూడు మొబైల్స్ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగానే దీని గురించి సమాచారం తెలవడంతో చాలామంది వీటిని బుక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారు.. మెరుగైన కెమెరా పనితీరు కావాలని అనుకునేవారు ఈ కంపెనీ ఫోన్లు కొనడానికి సిద్ధమవుతున్నారు. ఇందులోVivo V70 రూ.45,000 ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది.Vivo V70 Elite మొబైల్ రూ.50,000 ధర ఉండనుంది.Vivo X200T మొబైల్ ను రూ.60,000 లతో విక్రయించే అవకాశం ఉంది.

Exit mobile version