KCR: ఎమ్మెల్యే కోరిక కాదనలేకనే కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ !

కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్‌ ఉన్నారు. ఆయన తన సీట్లో కేసీఆర్‌ పోటీ చేయాలని అడిగారని తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని ఎవరూ అనుకోరు.

Written By: Raj Shekar, Updated On : October 8, 2023 11:55 am

KCR

Follow us on

KCR: నమ్మొద్దు.. నమ్మొద్దు రన్నో నాయకున్ని.. నమ్మితే ముంచేస్తాడన్నో నాయకుడు.. అని ఓ సినీ కవి ఎనాడో రాశాడు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం చేసే పనులు కూడా ప్రజల కోసమే చేస్తున్నామని చెబుతుంటారు. ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సిద్ధ హస్తుడు. యాదాద్రి పునర్నిర్మాణం.. యాదాద్రి నుంచి ఎర్రవల్లికి రోడ్డు.. దళితబంధు, బీసీబంధు, రైతుబంధు, రైతుబీమా.. ఇలా చెప్పుకుటూ పోతే అనేక పథకాలు కూడా కేసీఆర్‌ తాను ఎన్నికల్లో గెలిచేందుకు చేసినవే. కానీ తెలంగాణ రైతులు, ప్రజల కోసమే ఇవన్నీ చేస్తున్నానని చెబుతాడు గులాబీ బాస్‌. రాజకీయాల్లో ఇవన్నీ సహసం. తాము చేయాలనుకున్నది చేసేసి ప్రజల కోసమే చేస్తున్నామని చెబుతున్నామని.. ప్రజలే కోరారని చెబుతూంటారు. కామెడీ ఏమిటంటే.. వారిని ఎవరూ కోరరు. కావాలంటే వారే కొంత మందితో కోరిపించుకుంటారు. ఇదంతా ఓ ప్రాసెస్‌. తాజాగా కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారన్న అనుమానం అందరిలోనూ ఉంది. దీనికి సమాధానంగా ఇదే ఫార్ములా సమాధానాన్ని బీఆర్‌ఎస్‌ రెడీ చేసుకుంది. ఏమిటంటే అది ఎమ్మెల్యే కోరాడనే కేసీఆర్‌ అక్కడ పోటీ చేస్తున్నారట.

‘గంప’తో చెప్పించి మరీ..
కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్‌ ఉన్నారు. ఆయన తన సీట్లో కేసీఆర్‌ పోటీ చేయాలని అడిగారని తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని ఎవరూ అనుకోరు. కానీ కేసీఆర్‌ అలా అనుకున్న తర్వాత మీడియాలో ప్రచారం పెట్టారు. చివరికి ఎమ్మెల్యేలకు సంకేతాలు పంపారు. కేసీఆర్‌ పోటీ చేస్తానంటే తాను త్యాగానికి సిద్ధమని ప్రకటన చేయాలని చెప్పారు. కేసీఆర్‌ను కాదనేంత ఉండదు కాబట్టి.. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినందుకు తనకు ఏదో ఓ గుర్తింపు ఇస్తారని ఆయన కూడా సరే అన్నారు. కేసీఆర్‌ పోటీ చేయాలన్నారు. అదే మాటల్ని కేటీఆర్‌ చెబుతున్నారు.

అందరూ కోరతారు…
నిజానికి కేసీఆర్‌ పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యేలంతా తమ సీట్ల నుంచి పోటీ చేయమని పిలుస్తారు. మరి కేసీఆర్‌ కామారెడ్డినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు. కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంపై ఇప్పటికే వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. గజ్వేల్‌లో గడ్డు పరిస్థితి ఉందని.. అందుకే పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం కేసీఆర్‌ కామారెడ్డికి వెళ్లడానికి బలమైన కారణం బీఆర్‌ఎస్‌ చెప్పలేకపోతూండటమే. మరో కారణం.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోల కూతురును నిజామాబాద్‌ బరిలో నిలిపి గెలపించడం. తాను లోక్‌సభ పరిధిలో ఉంటే.. కవిత గెలుపు ఈజీ అవుతుందని అంటున్నారు. మరోవైపు కవిత ఒత్తిడితోనే కేసీఆర్‌ కామారెడ్డికి వచ్చారని ప్రచారం కూడా జరుగుతోంది.