Jawan OTT: వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ షారుక్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన గత రెండు చిత్రాలు పఠాన్, జవాన్ బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ఒక్కో చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. పఠాన్ షారుక్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. పఠాన్ సక్సెస్ మరచిపోయే లోపే జవాన్ తో వచ్చేశాడు. సౌత్ ఇండియన్ యంగ్ డైరెక్టర్ అట్లీ జవాన్ చిత్ర దర్శకుడు కావడం విశేషం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.
జవాన్ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. కథలో కొత్తదనం లేదు. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ కేక అన్నారు. టాక్ తో సంబంధం లేకుండా జవాన్ భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2, పఠాన్, గదర్ 2 వసూళ్ల మార్క్ దాటేసింది. హిందీ ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. షారుక్ రెండు చిత్రాలు ఈ ఏడాది రూ. 2000 కోట్లు వసూళ్లు సాధించడం గొప్ప పరిణామం. గత ఏడాది కనీస వసూళ్లు లేక ఇబ్బందిపడ్డ హిందీ చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.
సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. జవాన్ బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసిన నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. నవంబర్ 2న జవాన్ స్ట్రీమ్ కానుంది. జవాన్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్ లో జవాన్ అందుబాటులోకి రానుంది. మరొక విశేషం ఏమిటంటే… థియేటర్ కాపీలో లేని సన్నివేశాలతో జవాన్ స్ట్రీమ్ అవుతుందట. జవాన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానుందని అంటున్నారు. నెట్ఫ్లిక్స్ చందాదారులు ఫ్రీగా జవాన్ మూవీ వీక్షించవచ్చు.
జవాన్ ఓటీటీలో కూడా భారీ ఆదరణ దక్కించుకుంటుంది చిత్ర యూనిట్ భావిస్తుంది. షారుక్ ఖాన్ కి జంటగా నయనతార నటించింది. ఇక ప్రధాన విలన్ రోల్ విజయ్ సేతుపతి చేశాడు. ప్రియమణి కీలక రోల్ లో అలరించింది. ఇక దీపికా పదుకొనె గెస్ట్ రోల్ సినిమాకు హైలెట్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ అలరించింది.