దేశంలో నియంత పాలన: కేసీఆర్

దేశంలో కేంద్ర ప్రభుత్వ పాలన నియంత తరహాలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పై స్పందించిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు ప్రకటించిన ప్యాకేజి పూర్తిగా మోసపూరితంగా ఉందని, రాష్ట్రాలను బిక్షగాళ్లు గా భావించినట్లు ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ఆదాయాలు లేని పరిస్థితిలో నిధులు ఇవ్వాలని అడిగితే ఇంత దిక్కుమాలిన తనంగా కేంద్రం ప్రవర్తించిందని, ఇది ఒక ప్యాకేజీనా అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలపట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 10:36 am
Follow us on

దేశంలో కేంద్ర ప్రభుత్వ పాలన నియంత తరహాలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పై స్పందించిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు ప్రకటించిన ప్యాకేజి పూర్తిగా మోసపూరితంగా ఉందని, రాష్ట్రాలను బిక్షగాళ్లు గా భావించినట్లు ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ఆదాయాలు లేని పరిస్థితిలో నిధులు ఇవ్వాలని అడిగితే ఇంత దిక్కుమాలిన తనంగా కేంద్రం ప్రవర్తించిందని, ఇది ఒక ప్యాకేజీనా అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలపట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గం గా వ్యవహరిస్తుందా అని అన్నారు. రుణ పరిమితి కూడా షరతులతో పెడతారా? మున్సిపాల్టీలలో పన్ను పెంచి, 2000 కోట్ల అప్పు ఇస్తారట. వన్ నేషన్ ,వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అని మరో కండిషన్ పెట్టడం ఇది పచ్చి మోసం అని కేసీఆర్ అన్నారు.

20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించి కేంద్రం తన పరువు తానే తీసుకుందని కెసిఆర్ అన్నారు.ఈ మాటలు అంటున్నందుకు విచారిస్తున్నానని, రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించడం ఫెడరలిజానికి విఘాతం అని ఆయన అన్నారు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారని కెసిఆర్ అన్నారు. ఏ మాత్రం వాంచనీయం కాదని అన్నారు.మూడు కండిషన్ లు భర్తీ చేయగలం, కరెంటు సంస్కరణలను ఒప్పుకోం అని ఆయన అన్నారు. కేంద్రం నియంత లా వ్యవహరించిందని కెసిఆర్ అన్నారు.రాష్ట్రాలకు మరిన్ని బాద్యతలు ఉన్నాయని, కేంద్రానికంటే ఎక్కువ బాద్యతలు ఉన్నాయని ఆయన అన్నారు.