వలస కార్మికుల పట్ల కొద్దీ రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక వాద్రా సానుభూతి చూపిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రాల నుండి తరలించిన వలస కార్మికులకు ఆమె సొంతంగా టికెట్ డబ్బు ఇస్తున్నట్లు పోస్టర్లు కూడా వెలిశాయి.
అయితే ఈ ప్రచారం బెడిసి కొట్టడంతో సరికొత్త పంధాతో మళ్ళీ ఈసారి ప్రియాంకా వాద్రాను రంగంలోకి దించారు. “ఉత్తర ప్రదేశ్‌లో మేము పార్టీ తరపున 1000 బస్సులనైనా ఏర్పాటు చేసి, కార్మికులను వాళ్ళ ఇళ్ళ వద్ద దించుతాం, అందుకు సిద్దం..” అంటూ కార్మికులను రెచ్చగొట్టేలా ప్రియాంక చేత ప్రకటన విడుదల చేయించారు.
మండుతున్న ఎండలో కార్మికులు నడచి పోతున్నా పట్టించుకోవడం లేదని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఇండ్లకు దింపేందుకు ప్రభుత్వానికి చేతగాని పక్షంలో తమకు చెప్తే బస్సులు ఏర్పాటుచేస్తామని అంటూ ఆమె ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసే రీతిలో మాట్లాడారు.
అయితే యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమె మాటలను సీరియస్ గా తీసుకొని గట్టి ఝలక్ ఇవ్వడంతో కాంగ్రెస్ వారంతా ఖంగు తినవలసి వచ్చింది. ఆమె ప్రకటన వచ్చిన కొద్దీ సేపటికే ఉత్తర ప్రదేశ్ హోం కార్యదర్శి అవినాష్ అశ్వతి ద్వారా నేరుగా ప్రియాంకకు ఉత్తరం వెళ్ళింది..
మీరు ఏర్పాటు చేస్తున్న 1000 బస్సులు ఎక్కడ..??
వాటి నంబర్లు, డ్రైవర్ల ఫోన్ నంబర్లు, ఏ ఏ లొకేషన్ల నుంచి ఏ ఏ లొకేషన్లకు ఆ బస్సులను నడుపుతారో వెంటనే తెలపండి., శ్రామికులకు సమాచారం ఇచ్చి బస్సుల వద్దకు తీసుకువస్తాం” అంటూ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.. దానితో ఖంగుతిన్న ప్రియాంక తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఎటువంటి ప్రత్యుత్తరమూ ఇవ్వలేదనే కధనం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.