KCR BRS – Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నారు. రెండు సార్లు గెలిచిన గర్వం.. మూడోసారి తెలంగాణలో అధికారం కోసం ఆశపడుతున్నాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈసారి గెలుపు కోసం ఆరాటపడుతున్నాడు. ఇక తెలంగాణను వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. టీఆర్ఎస్ ను నిన్ననే బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఫుల్ హైప్ తీసుకొచ్చారు.
అయితే అన్నీ ఉన్నా ఈ ఫంక్షన్ లో ఇద్దరి లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదే కేసీఆర్ కూతురు కవిత అస్సలు ఎక్కడా కనిపించలేదు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు రావడంతో కేసీఆర్ తన కూతురిని పక్కనపెట్టాడా? అన్న ప్రచారం సాగుతోంది.
Also Read: AP Three Capitals Issue: ప్రజల్లో తేలిపోతున్న మూడు రాజధానుల ముచ్చట
ఇక అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం.. టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మేనల్లుడు హరీష్ రావు కూడా ఎక్కడా కనిపించలేదు.ఆయన ఫొటో ఒక్కటంటే ఒక్కటి కూడా హైదరాబాద్ లో కేసీఆర్ ‘బీఆర్ఎస్’ హోర్డింగులు, పోస్టర్లలో కనిపించకపోవడం గమనార్హం. కూడా కేసీఆర్ పక్కనపెట్టారనే చెప్పొచ్చు.
హరీష్ రావును ఎప్పటి నుంచో కేసీఆర్ సైడ్ చేసేశారు. గతంలో ఈటల రాజేందర్ ను తొలగించినప్పుడే ఆయనకు మద్దతుగా ఉన్న హరీష్ రావు పని అవుట్ అని.. నెక్ట్స్ హరీష్ అన్న ప్రచారం సాగింది. కానీ అటు కేసీఆర్.. ఇటు హరీష్ రావులు ఈ విషయంలో తొందరపడలేదు.
కొడుకు కేటీఆర్ కు పోటీగా హరీష్ ఉండడం.. బలమైన నేత కావడంతో కావాలనే హరీష్ ను కేసీఆర్ చాకచక్యంగా దూరం పెడుతున్నాడని.. పార్టీలో.. ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న టాక్ ఉంది. అందుకే ఇప్పుడు హరీష్ రావును జాతీయ రాజకీయాల వేళ అస్సలు ఊసు లేకుండా చేశారని టాక్ వినిపిస్తోంది. అటు ఫ్లెక్సీల్లో పెట్టకుండా.. ఇటు జాతీయ రాజకీయాల్లో ఇన్ వాల్వ్ కాకుండా హరీష్ ను దూరం పెట్టారని అంటున్నారు. మరి ఇదంతా నిజమా? లేక ఒట్టి ప్రచారమా? అన్నది తేలాల్సి ఉంది. హరీష్ అయితే నిన్న హైదరాబాద్ ఫ్లెక్సీల్లో ఎక్కడా కనిపించకపోవడం చూస్తే నిజమనే అనుమానం రాకమానదు.
Also Read:KCR National Party- AP: సే సోరీ టూ ఏపీ… అప్పుడే కేసీఆర్ ని ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేసేది