Adipurush- Vishva Hindu Parisha: ఆదిపురుష్ మూవీపై విమర్శల పరంపర కొనసాగుతుంది. పలువురు తీవ్ర స్థాయిలో ఆదిపురుష్ చిత్రాన్ని తప్పుబడుతున్నారు. తాజాగా విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి దిగింది. ఆదిపురుష్ మూవీపై ఆ సంస్థ పలు ఆరోపణలు చేయడం జరిగింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించని నేపథ్యంలో ప్రదర్శన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆదిపురుష్ టీజర్లో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానంగా రామాయణాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని వారి ప్రధాన ఆరోపణ. సంభాల్ యూనిట్ ప్రచార ప్రముఖ్ అజయ్ శర్మ మీడియా ముఖంగా అనేక అభ్యంతరాలు తెలిపారు.
ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులను కూడా ఆయన తప్పుబట్టారు. వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఆదిపురుష్ టీజర్ లో అన్ని లోపాలు ఉండగా ఎలా ధృవీకరించి ప్రదర్శనకు అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం సెన్సార్ సభ్యులపై చర్యలు తీసుకోవాలి. సెన్సార్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సినిమాలో ఉన్న పొరపాట్లను సరిదిద్దాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు తొలగించాలి. లేదంటే ఆదిపురుష్ సినిమా ప్రదర్శన జరగనీయమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
దాదాపు సినిమా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో మేకర్స్ కి తాజా పరిస్థితులు పరిస్థితులు మింగుడు పడడం లేదు. షూటింగ్ కూడా పూర్తయ్యాక ప్రధాన పాత్రల గెటప్స్ మార్చడం కుదిరే పనేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తి చేశారు. మరి ఈ కఠిన సవాళ్ల నుండి ఆదిపురుష్ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి.
దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఇక రామాయణంలో మెయిన్ విలన్ గా ఉన్న రావణాసురుడు పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ప్రభాస్ ఈ మూవీతో కమ్ బ్యాక్ కావాలని చూస్తున్నారు.
Also Read:Sukumar Remuneration: పుష్ప2 కోసం సుకుమార్ పారితోషికం ఎంతో తెలుసా?