తెలంగాణలో ఆరేళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపు

తెలంగాణ కల సాకారమై నేటికి ఆరేళ్లు నిండాయి. ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. నీళ్లు-నిధులు-ఉద్యోగాల కోసం చేపట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ముందుండి పోరాడారు. ఆయనకు అండగా తెలంగాణలోని సబ్బండ వర్గాలు నిలిచాయి. ఎందరో అమరవీరుల ప్రాణాత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ […]

Written By: Neelambaram, Updated On : June 2, 2020 1:16 pm
Follow us on

తెలంగాణ కల సాకారమై నేటికి ఆరేళ్లు నిండాయి. ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. నీళ్లు-నిధులు-ఉద్యోగాల కోసం చేపట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ముందుండి పోరాడారు. ఆయనకు అండగా తెలంగాణలోని సబ్బండ వర్గాలు నిలిచాయి. ఎందరో అమరవీరుల ప్రాణాత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ అవలంభించిన సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఈ ఆరేళ్ల కాలంలో పలురంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, ఐటీ, సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచింది. ఇంకా కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సి ఉంది.

స్వరాష్ట్రంలో యువతకు దక్కిందెంటీ?
తెలంగాణ పోరాటాన్ని భుజస్కందలపై మోసిన యువతకు ఈ ఆరేళ్ల కాలంలో ఏం దక్కిందనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన నీళ్లు, నిధులలో రాష్ట్రం ఆశించిన ఫలితాలు సాధించింది. అయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఫలితాలు అందించడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందనే అభిప్రాయం కలుగుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆశించిన రీతిలో ఎక్కడా నియమకాలు జరుగలేదని ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు పలుసార్లు అసెంబ్లీ ముట్టడికి దిగిన సంఘటనలు ఉన్నారు. స్వరాష్ట్రంలోనూ ఉద్యోగాల నియమకాల కోసం పోరాడాల్సి వస్తుందని తెలంగాణ యువత, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు ఆశించారు. అయితే వారి ఆకాంక్ష మాత్రం తీరలేదు.

లక్షల్లో ఖాళీలు.. వేలల్లోనే భర్తీ..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లక్షల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయడంలేదని ఆరోపణలున్నాయి. తెలంగాణలో 2.86లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు అంచనా. అయితే ఈ ఆరేళ్లలో ప్రభుత్వం కేవలం 27వేలకుపైగా పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కోర్టు కేసులతో టీఎస్‌పీఎస్సీ చేపడుతున్న నియామకాలు ముందుకు కదలని పరిస్థితులున్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇవ్వడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని వారంటున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో ఈ ఏడాది కూడా నిరుద్యోగుల ఆశలు తీరేలా కన్పించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలపై దృష్టిసారించినట్లయితే వారి ఆశలు కొంతమేరకైనా తీరుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడిన యువత ఆశలు ఈ ఏడాదైనా తీరాలని ఆశిద్దాం..