తెలంగాణ ప్రతిపక్షాలన్నీ యువత ఉద్యోగాలివ్వాలన్న అంశాన్ని నెత్తిన పెట్టుకున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అయ్యాక సీఎం కేసీఆర్ కు యువతపై సానుభూతి కలిగింది. ఈ రోజు ఓ శుభ ముహూర్తాన కేసీఆర్ యువతకు ఒక మంచి వార్త చెప్పారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు.
స్వరాష్ట్ర ఫలాలను యువత అనుభవించే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన ధ్యేయంగా ఏడేళ్లుగా అమలు చేస్తున్న కార్యాచరణ కొలిక్కి వచ్చిందన్నారు. స్వరాష్ట్ర ఫలాలను యువత అనుభవించే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సీఎం తెలిపారు.
ఇప్పటిదాకా పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని.. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రైవేటు రంగంలో ఇప్పటికే భారీగా ఉపాధి కల్పించామని.. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు అందించామని.. మరో 50వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభించామని కేసీఆర్ తెలిపారు. భవిష్యత్ లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు.
వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనుక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఎంతో ఉందన్నారు. పారిశ్రామిక, వాణిజ్యం, ఐటీ రంగాలు సహా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతూ లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువతకు నైపుణ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు.
ఇలా కేసీఆర్ ఇచ్చిన వరాలతో యువత ఇన్నాళ్లు అయినా మా పై దయం కలిగినందుకు ధన్యవాదాలు అంటూ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైసీఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగంపై చేస్తున్న పోరుబాట ఎఫెక్ట్ అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.