అలా అయితే శ్రీదేవి కోరిక తీరినట్లే !

‘అతిలోక సుందరి శ్రీదేవి’కి తన చిన్న కూతురు ఖుషీ కపూర్ అంటే విపరీతమైన ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా ఎప్పుడు తన చిన్న కూతురు గురించే ఆలోచిస్తుంది. చిన్న కూతురికి తన అందం రాకపోయినా, తన గుణం వచ్చింది. అందుకే ‘ఖుషీ అచ్చం నాలాగే ఆలోచిస్తోంది’ అంటూ శ్రీదేవి ఎప్పుడు మురిసిపోతూ ఉండేదట. తన పెద్ద కూతురు ఎలాగైనా బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటుందని, కచ్చితంగా ఆమె స్టార్ అవుతుందని.. […]

Written By: admin, Updated On : July 15, 2021 5:04 pm
Follow us on

‘అతిలోక సుందరి శ్రీదేవి’కి తన చిన్న కూతురు ఖుషీ కపూర్ అంటే విపరీతమైన ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా ఎప్పుడు తన చిన్న కూతురు గురించే ఆలోచిస్తుంది. చిన్న కూతురికి తన అందం రాకపోయినా, తన గుణం వచ్చింది. అందుకే ‘ఖుషీ అచ్చం నాలాగే ఆలోచిస్తోంది’ అంటూ శ్రీదేవి ఎప్పుడు మురిసిపోతూ ఉండేదట.

తన పెద్ద కూతురు ఎలాగైనా బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటుందని, కచ్చితంగా ఆమె స్టార్ అవుతుందని.. ఆమె అందచందాల పై తనకు ఎంతో నమ్మకం ఉందని ఎప్పుడు తన సన్నిహితుల దగ్గర గర్వంగా చెబుతూ ఉంటుందట శ్రీదేవి. అందుకు తగ్గట్టుగానే జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది జాన్వీ.

అయితే శ్రీదేవి చిరకాల కోరిక మాత్రం ఇంకా తీరలేదు. తన చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా స్టార్ అవ్వాలని కలలు కంది. కానీ, ఇప్పటికైతే ఆ కల ఇంకా కలగానే మిగిలిపోయింది. అయితే తాజాగా బోనీ కపూర్ తన కుమార్తె ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఖుషీ కపూర్ ఇప్పటికే గ్లామర్ పెంచడానికి సర్జరీలు కూడా చేయించుకుని రెడీ అయింది.

మొత్తమ్మీద ఖుషీ కపూర్ పర్ఫెక్ట్ బాడీతో ఈ ఏడాది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అరంగేట్రంలోనే మంచి సినిమాతో ఖుషి ఎంట్రీ ఇవ్వబోతుంది. నిర్మాత కరుణ్ జోహార్ నిర్మాణంలో ‘టీనేజ్ గర్ల్’ అనే సినిమా త్వరలోనే మొదలు అవ్వనుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా ఖుషీ కపూర్ తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు. మరి ఖుషి కపూర్ తన అక్క లాగే తానూ కూడా సక్సెస్ అవుతుందా, అయితే శ్రీదేవి కోరిక తీరినట్లే.